ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here

Tuesday, 3 December 2013

ప‌వ‌న్ పాలి'ట్రిక్స్‌'

ప‌వ‌న్ పాలిట్రిక్స్‌, Pawan Politricks, Pawan Kalyan Politricks, Power Star Politrcks
ప‌వ‌న్ క‌ల్యాణ్ ... ఆయ‌న ఏం చేసినా, చేయ‌క‌పోయినా... మాట్లాడినా, లేక‌పోయినా సంచ‌ల‌న‌మే. ఎప్పుడూ మౌనంగా ఉండే ప‌వ‌న్ .. తాట‌తీస్తా.. అంటూ అత్తారింటికి దారేది అభినంద‌న స‌భ‌లో హెచ్చ‌రిస్తే అదో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ప‌వ‌న్ - రాజ‌కీయాలూ ఈ అంశం ఎప్పుడూ హాట్ టాపిక్కే.  అలాంటిది ఆయ‌న నోటి నుంచే పాలిటిక్స్ గురించి వినే అవ‌కాశం ద‌క్కింది.   ప‌వ‌న్‌రాజ‌కీయాల్లోకి వ‌స్తాడా??
ప‌వ‌న్ పాలిట్రిక్స్‌, Pawan Politricks, Pawan Kalyan Politricks, Power Star Politrcks
వ‌స్తే ఏ పార్టీలో చేర‌తాడు??  అనే విష‌యంమీద గ‌త కొంత‌కాలంగా చ‌ర్చ న‌డుస్తూనే ఉంది. ఇప్పుడు ప‌వ‌న్ దానికి ఆజ్యం పోశాడు. మీరు రాజ‌కీయాల్లో మ‌ళ్లీ ఎప్పుడొస్తారు??  అని ఓ ఇంట‌ర్యూలో అడిగిన ప్ర‌శ్న‌కు ''నేను రాజ‌కీయాల‌కు దూరం అయితేనే కాదా, మ‌ళ్లీ రావ‌డానికి'' అని తెలివిగా స‌మాధానం చెప్పాడు ప‌వ‌న్‌!  నేను రాజ‌కీయాల్లోనే ఉన్నా అనే సంకేతాలు పంపాడు. త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న ఈ తరుణంలో ప‌వ‌న్ స్టేట్ మెంట్ చాలా ప్రాధాన్య‌త సంత‌రించుకొంది. ఈ మాట‌ల వెనుక ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకోగ‌లిగితే ప‌వ‌న్ కి పాలిటిక్స్ పై క్రేజ్ ఉంద‌నే తెలుస్తోంది. మ‌రి ఈ మాట‌.. ఆయ‌న్ని ఎక్క‌డి వ‌ర‌కూ తీసుకెళ్తుందో, రాజ‌కీయాల్లో ఎలాంటి సంచ‌ల‌నాల‌కు కేంద్ర‌బిందువు అవుతుందో చూడాలి.

Post Comments

No comments:

Post a Comment