ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here

Tuesday, 3 December 2013

కిరణ్ రెడ్డిగారు.. మాట్లాడండి సర్!

కిరణ్ రెడ్డిగారు.. మాట్లాడండి సర్
అధిష్టానంకు వ్యతిరేకంగా తనను తాను స్టార్ బ్యాట్స్ మెన్ గా కీర్తించుకుంటున్న మన ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ మధ్య అసలు విభజన వ్యవహారం మీద బొత్తిగా మాట్లాడడం లేదు. తాను సమైక్యవాదినని చెప్పుకునే సీఎం కిరణ్ గత నాలుగు రోజులుగా కేంద్రం నుండి రాయల తెలంగాణా అని వినిపిస్తుండగా దానికి వ్యతిరేకమనో.. అంగీకారమో తెలపక మౌనంగా ఉంటున్నారు. ఈ విషయం మీద సీమాంధ్ర, తెలంగాణా నేతలు ఢిల్లీలో పరుగులు పెడుతున్నా కిరణ్ కనీసం రాష్ట్రంలోనైనా పల్లెత్తిమాట అనడంలేదు.
కిరణ్ రెడ్డిగారు.. మాట్లాడండి సర్
ఎక్కడకు వెళ్ళినా ఏ కార్యక్రమం చేపట్టినా అందులో రాష్ట్రం విడిపోతే వచ్చే అనర్ధాలను చెప్పే కిరణ్ రెడ్డి తన సొంత ప్రాంతం రాయలసీమను రెండు ముక్కలు చేస్తుంటే మౌనంగా ఉండడం ఎంతవరకు సమంజసమో అర్ధం కావడం లేదు. దీనినే ఆసరాగా చేసుకొని రాయలసీమలోని మిగతా నేతలు కిరణ్ ను టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా వైకాపా పార్టీ ఈ విషయాన్ని అడ్డం పెట్టుకొని కిరణ్ రెడ్డిని కార్నర్ కు నెట్టాలని చూస్తుంది.

వైకాపా సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ప్రభంజనాన్ని సోనియా తట్టుకోలేక రాయల తెలంగాణ అంటూ.. కాంగ్రెస్ యూ టర్న్ తీసుకుందని.. ఇంత జరుగుతున్నా సీఎం కిరణ్ మౌనంగా ఉండడం దారుణమని.. రాష్ట్ర విభజనకు అసలుసిసలు కుట్రదారులు సీఎం కిరణ్ వ్యాఖ్యానించారు. సోనియా ఆజ్ఞలతోనే కిరణ్ ఇలా రాయల తెలంగాణపై మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. మరి కిరణ్ గారు ఇప్పటికైనా ఈ అంశం మీద నోరు మెదిపి.. స్టార్ బ్యాట్స్ మెన్ గానే ఉంటారో.. లేక రాయలసీమ పాపిగా మిగిలిపోతారో చూడాలి!

Post Comments

No comments:

Post a Comment