మహేష్‌బాబు వేగం పెంచి ఏడాదికి రెండు సినిమాలైనా చేద్దామని అనుకున్నప్పుడల్లా ఏదో ఒక అవాంతరం వచ్చి పడుతుంది. పోకిరి, సైనికుడు ఒక ఏడాదిలో విడుదలైన తర్వాత అతని సినిమాలు ఒకే ఏడాదిలో రెండేసి రావడం దాదాపు అసాధ్యమైపోతోంది. గత ఏడాది సంక్రాంతికి బిజినెస్‌మేన్ వస్తే, అదే ఏడాదిలో వస్తుందని అనుకున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఈ సంక్రాంతికి కానీ విడుదల కాలేదు.
అలాగే ఇదే ఏడాదిలో విడుదల చేసి తీరాలని మహేష్ ఫిక్స్ అయిన సుకుమార్ చిత్రం ముందుకి కదలడం లేదు. ఈ చిత్రం షూటింగ్ చాలా చాలా తాపీగా జరుగుతోందని, సుకుమార్ ఏమాత్రం తొందర పడకుండా జాగ్రత్తగా షాట్, షాట్‌ని శిల్పిలా చెక్కుతున్నాడని, ఇది మహేష్‌ని అసహనానికి గురి చేస్తోందని, ఈ సినిమా షెడ్యూల్స్ ఏవీ సజావుగా జరగకపోవడం వల్ల మహేష్ తనతో 'ఆగడు' తీయడానికి రెడీ అవుతున్న శ్రీను వైట్లని తొందరగా కథ సిద్ధం చేయమని తొందర పెడుతున్నాడని, సుకుమార్ సినిమాకి సైమల్టేనియస్‌గా అది మొదలు పెట్టేస్తే తన టైమ్ వేస్ట్ అవకుండా ఉంటుందని భావిస్తున్నాడని భోగట్టా.