పాకిస్తాన్ జైలులో భారతీయ ఖైదీ తోటి ఖైదీలతో చావుదెబ్బలు తిన్నాడు. అతన్ని అధికారులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. అతనే సరబ్ జిత్ సింగ్. దానికి ప్రతీకారమా? అన్నట్టుగానే జమ్మూకాశ్మీర్‌లోని జైల్లో పాకిస్తాన్ ఖైదీ సనావుల్లాపైనా దాడి జరిగింది.
తోటి ఖైదీ ఒకరు దాడి చేయగా సనావుల్లా తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న చనిపోయాడు. దీనిపై పాకిస్తాన్ గుర్రుగా ఉన్నది. యుద్ధంలో దెబ్బకు దెబ్బ కొడతారుగాని, ఇలాంటి ఘటనలు ప్రశాంతంగా ఉన్న పరిస్థితులను యుద్ధ వాతావరణంవైపుకు మళ్ళిస్తాయి. సరబ్‌జిత్‌కీ సనావుల్లాకీ చాలా తేడాలున్నాయి.
సనావుల్లాఖాన్ ఓ బస్సు దహనం కేసులో అరెస్టయిన తీవ్రవాది. సరబ్‌జిత్‌సింగ్ అనుకోకుండా బోర్డర్ దాటి పాకిస్తాన్‌లోకి ప్రవేశించి ఉగ్రవాదిగా ముద్రవేయబడ్డవాడు. ఏదేమైనా ఇలాంటి సందర్భాల్లో దెబ్బకు దెబ్బ అని ఎవరూ భావించరాదు. అది ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలను చెడగొడుతుంది.