ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Wednesday, 15 May 2013

    మ‌ళ్లీ గొంతు విప్పుతున్న ప‌వ‌న్‌

    మ‌ళ్లీ గొంతు విప్పుతున్న ప‌వ‌న్‌ | Pawan Kalyan Sing Song in Attharintiki Daredi
    బైబైయ్యే బంగారు ర‌మ‌ణ‌మ్మ‌… సీకాకుళం యాస‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ పాడిన పాట గుర్తుందా? ఖుషీ సినిమాలో బోలెడు హిట్ సాంగ్స్ ఉన్నా – అవ‌న్నీ కాకుండా ఈ పాట‌నే ఎక్కువ పాడుకొంటారు ప‌వ‌న్‌ ఫ్యాన్స్‌! అడ‌పా ద‌డ‌పా ఇలాంటి పాట‌లు పాడుతూనే ఉంటాడు ప‌వ‌న్‌! తొలిసారి ఓ సినిమాకి పూర్తిస్థాయి పాట పాడ‌డానికి సిద్ధమ‌య్యాడు. ప‌వ‌న్ క‌ల్యాణ్ – త్రివిక్రమ్ క‌ల‌యిక‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటోంది. ‘అత్తారింటికి దారేది’ అనే పేరు ప‌రిశీలిస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీంత ద‌ర్శకుడు. దేవిశ్రీ‌.. ప‌వ‌న్ చేత ఓ పాట పాడించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాడ‌ట‌. పూర్తి పాట కాద‌నుకోండి. పాట‌కు ముందొచ్చే ప‌దాలు.. ప‌వ‌న్ ప‌లుకుతాడ‌ట‌. వావ్‌… వ‌వ‌న్ ఫ్యాన్స్‌ కి ఇది సూప‌ర్ న్యూసే క‌దూ.

    Tollywood

    Bollywood

    Kollywood