ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Wednesday, 15 May 2013

    ఈవారం రెండు మ‌సాలా సినిమాలు

    Two Masala Movies Ready To Release | ఈవారం రెండు మ‌సాలా సినిమాలు

    ‘ఈరోజుల్లో’, ‘బ‌స్‌ స్టాప్’ ఫ‌లాలు ఇంకా వస్తూనే ఉన్నాయి. 5డీ పుణ్యం.. ఇంకా పంట పండిస్తూనే ఉంది. మారుతికి జై కొడుతూ మ‌రో రెండు మ‌సాలా సినిమాలు వ‌చ్చేస్తున్నాయి. అవే.. ‘ల‌వ్‌సైకిల్‌’, ‘ల‌వ్‌ ట‌చ్‌’. ఈరోజుల్లో ఫేమ్ శ్రీ‌, రేష్మా జంట‌గా న‌టించిన సినిమా ‘ల‌వ్ సైకిల్‌’. స‌ప‌న్ కుమార్ ద‌ర్శకుడు. ట్రైల‌ర్ చూస్తుంటే ఇందులో బ‌స్‌ స్టాప్ త‌ర‌హా స‌న్నివేశాల‌కు లోటు లేద‌నే విష‌యం అర్థం అవుతూనే ఉన్నాయి.

    ఎంత ప్రేమ‌లేక‌పోతే న‌న్ను వెంట‌నే త‌న రూమ్‌ కి ర‌మ్మంటాడు, ప్రేమంటే నాకాలా..? ఇలాంటి బోలెడు బూతు జోకులు ఈ సినిమా నిండా పేర్చేశారు. మ‌రో బుల్లి సినిమా ‘ల‌వ్ ట‌చ్’ కూడా ఈవార‌మే వ‌స్తోంది. ఇందులోనూ టూమ‌చ్ స‌న్నివేశాలున్నాయి.

    బ‌స్‌ స్టాప్‌లోలా.. సిమ్మూ, సెల్లూ అంటూ బూతుల్ని మ‌రో ర‌కంగా వినిపించారు. వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్ పోయేదేముంది..? మ‌హా అయితే సెల్‌ బిల్లూ, పెట్రోలు బిల్లూ బొక్క‌… అంటూ మిర్చి డైలాగుల‌ను కూడా వాడేసుకొన్నారు. ఈ రెండు సినిమాలూ ఈనెల 17న వ‌చ్చేస్తున్నాయి. ఈ పైత్యం.. యువ‌త‌కు ఎక్కుతుందో, లేదంటే క‌డుపులో తిప్పుతుందో తేలాలంటే వెయిట్ అండ్ సీ.

    Tollywood

    Bollywood

    Kollywood