జగన్ మళ్లీ తన బెయిల్ కోసం కౌంటర్ ఎటాక్ చేసారు, దానిని తిప్పికొట్టేందుకు సిబిఐ ఎన్ కౌంటర్ ఎటాక్ ఇచ్చింది. చార్జిషీట్లన్నీ కలిపి ఒకే సారి విచారణ చేయాలని లేటెస్టుగా జగన్ కోర్టులో పిటిషన్ వేస్తే అది కుదరదు అంటూ సిబిఐ కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. నేరాలు వేర్వేరు అయినప్పుడు ఒక్కసారి విచారణ ఎలా సాధ్యం, అది కుదరదు అని స్పష్టం చేస్తూ సిబిఐ కౌంటర్ పిటిషన్ లో పేర్కొంది.
జగన్ చేసిన తప్పునే మళ్లీ చేస్తున్నారని న్యాయకోవిదులు అంటున్నారు, కోర్టును విసిగిస్తే అసలుకే మోసం జరుగుతుందన్న విషయాన్ని జగన్ విస్మరిస్తున్నారా... లేక తాము ఏమి ప్రయత్నం చేయడం లేదని జగన్ తో చీవాట్లు తింటామన్న భయంతో ఆయన లాయర్లు కావాలని చేస్తున్న నిర్వాకమా తెలియదంటున్నారు వారు.
ఇంతకు ముందే జగన్ బెయిల్ కోసం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసినప్పుడే, విచారణ అంతా పూర్తయ్యాక ఒకే ఫైనల్ చార్జిషీట్ దాఖలు చేయాలని జగన్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ కూడా జరుపకుండానే అది సమ్మతమైనది కాదని కోర్టు తిరస్కరించింది.
ఇప్పుడు కూడా జగన్ మళ్లీ అదే చేసారు. కాకపోతే పదాలను అటు ఇటు చేసారు. అప్పడేమో అన్నింటికి కలిపి ఒకే చార్జిషీట్ దాఖలు చేయమంటే, ఇప్పుడు చార్జీషీట్లన్ని కలిపి ఒకే సారి విచారణ చేయాలని అన్నారు. దీనిలో తేడా ఏముంది, కాస్తా కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కడు అది,ఇదీ సేమ్ అంటారు. అలాంటిది న్యాయమూర్తులకు అర్థం కాదా.
రాముడు రావణుడిని హతమార్చెను అని ఒకరు అంటే, కాదుకాదు రావణుడు రాముని చేతిలో హతుడయ్యెను అని ఇంకోడన్నాడట. ఇలా చిన్న పిల్లల్లా కోర్టుతో ఎకసెక్కాలాడితే ఎంత ప్రమాదమన్నది ఆలోచించక పోతే ప్రమాదమే. ఇంతకీ జగన్ ను బెయిల్ పై బయటకు తెచ్చేందుకు ఆయన అడ్వకేట్లు ప్రయత్నిస్థున్నారా... లేక జగన్ శాశ్వతంగా జైలుకే పరిమితం చేయాలని చూస్తున్నారా... అని అనిపిస్తోంది అందరికి.