జనరల్‌గా తెలుగులో హీరోయిన్లకు ఎనేలని గౌరవమిస్తారని అందరికీ తెలిసిన విషయమే. ఇదే విషయాన్ని చాలామంది హీరోయిన్లు చెబుతుంటారు. అయితే కొంతమంది మాత్రం టాలీవుడ్‌ను బాగా వాడేసుకున్నాక, బయట మన గురించి ఒక్క మాట కూడా మాట్లాడరు. శ్రీదేవి, ఇలియానేలే ఇందుకు మాంచి ఉదాహరణ.. ఇక్కడ కోట్లు సంపాదించుకున్నాక, బయటకు వెళ్లి కామెంట్లు చేస్తుండటం వీళ్ళ హాబి.
ఇదే విధంగా నయనతార కూడా అప్పుడప్పుడు తెలుగును కాస్త తక్కువగానే చూస్తోంది. ఇంతగా ఈమె కోలీవుడ్‌ను పొగిడేస్తుంటే, వాళ్లు మాత్రం అమ్మడును చాలా లోకువగా వాడేసుకుంటున్నారు. మొన్న ధనుష్‌తో కలసి ఒక ఐటెం సాంగ్ చేసిన నయన, ఇప్పుడు ఆర్యతో ఒక సినిమా చేస్తోంది. ఈ సినిమా కోసం ఏకంగా నయనతార పెళ్ళంటూ పబ్లిసిటీ మొదలెట్టారు.
అదే తెలుగు సినిమాల్లో ఇలాంటి ఎప్పుడైనా చూశామా? తెలుగు ప్రొడ్యూసర్లు హీరోయిన్లను ఈ రేంజ్‌లో వాడుకుంటారా? మన భామలు అది తెలుసుకంటే బెటర్..