మీనింగ్ ఫుల్ సినిమాలే చేస్తాను, ఆర్టు సినిమాలు చెయ్యను, కమర్షియల్ ఎట్రాక్షన్లు కాస్త తగ్గిస్తా అంటూ కలరింగ్ ఇచ్చిన ఛార్మి, తనదైన స్టయిల్లో మళ్ళీ ప్రొడ్యూసర్లను బుట్టలో వేసుకోవడం మొదలెట్టింది.
నాయక్ వంటి సినిమాల్లో అమ్మడు చేసిన ఐటెం సాంగ్ చూస్తే, పాప ఒక రేంజ్‌లో లావెక్కేసి కుర్రాళ్ళకు కిక్కిచ్చే గ్లామర్‌ను కోల్పోయిందని కామెంట్లు వినిపించాయి. ఇక వాటన్నింటిని ఎదుర్కొనడానికి ఛార్మి కూడా కాస్త గట్టిగానే జిమ్ బాట పట్టింది. పైగా నాలుగు కేజీలు తగ్గిపోయాను చూడండి అంటూ వేసుకున్న టీ షర్టును కాస్త పైకి మడతపెట్టి తన నడుంను, బొడ్డును చూపిస్తూ ఫోజులిస్తోంది. ఇంతకీ ఇదంతా ఏదో అభిమానులతో పంచుకునే గుడ్‌న్యూస్ అనుకుంటున్నారా? అంతలేదు, కేవలం ఆర్టు సినిమాలే చేస్తానని చెప్పాక నడుం ఎలా ఉందో జనాలకు చూపించాల్సిన అవసరం లేదు.
కాని ఛార్మి మాత్రం శృతి హాసన్‌ను చూసి, ఎంత ఎక్స్‌ప్లోజివ్‌గా పోజులిస్తే జనాలు అంత గొప్పగా మాట్లాడుకుని, ప్రొడ్యూసర్లను తమ దగ్గరకు పరిగెత్తుకొచ్చేలా చేస్తారని ఈవిడ ఆశ.