ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Friday, 10 May 2013

    కారు దిగితే సీన్ వేరేలా ఉండేది: రామ్ చరణ్

    Ram Charan Clarification

    నడిరోడ్డుపై జరిగిన 'రచ్చ'పై హీరో రామ్ చరణ్ స్పందించారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే తనతో దురుసుగా ప్రవర్తించారని విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ ఘటన జరిగినప్పుడు తాను కారు దిగలేదని, తన ఫోటోలు మార్ఫింగ్ చేశారని ఆయన ఆరోపించారు. ఓ ఫోటో గ్రాఫర్ తనను బ్లాక్ మెయిల్ చేయబోయాడని చెప్పారు. తాను కారు దిగివుంటే సీన్ వేరేలా ఉండేదన్నారు.

    'రచ్చ'జరిగినప్పుడు కారులో తన భార్య ఉపాసన ఉందన్నారు. రెడ్ సిగ్నల్ వద్ద పదేపదే హారన్ కొట్టడమే కాకుండా, వాళ్లే రెండుసార్లు తన కారు డోర్ కొట్టారన్నారు. వారే తనతో దురుసుగా ప్రవర్తించారన్నారు. ఫ్యామిలీ మేన్ ని కాబట్టే తన సెక్యురిటీతో కొట్టించానన్నారు. తనతో గొడవ పెట్టుకున్న వారు ఐటీ ఉద్యోగుల్లా లేరన్నారు. వారు మద్యపానం సేవించి ఉన్నారన్న అనుమానాన్ని చరణ్ వ్యక్తం చేశారు. తాను పోలీసులకు ఫిర్యాదు చేయలేదన్నారు.

    Tollywood

    Bollywood

    Kollywood