ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Friday, 10 May 2013

    టాలీవుడ్ లో ఈ పాత్రకు ఎందుకు ఇంత క్రేజ్!

    Shreya,Pavithra,Shreya saran,Shreya as prostitute,Janardhan mahasrshi,Pavithra movie

    ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు అంటే వేశ్య పాత్రను హైలెట్ చేస్తూ వస్తున్న సినిమాలుగా మారిపోయాయి. శ్రియ, ఛార్మీ  లతో పాటు మంచిపాత్రలు చేసి మంచి ఇమేజ్ ఉన్న స్నేహాలాంటి హీరోయిన్స్ కూడా యిలాంటి పాత్రలు పై మక్కువ చూపడం, టాలీవుడ్ లో  పోటీస్థాయి ఏస్థాయిలో ఉందో అర్ధమౌతుంది.   శ్రియ ప్రధాన పాత్రలో ప్రముఖ రచయిత జనార్దన్ మహర్షి  దర్శకత్వంలో రూపొందిన ” పవిత్ర ” చిత్రం ఈరోజు సెన్సార్ సభ్యుల ముందుకు రానుంది అని తెలుస్తోంది. వేశ్య పాత్రలో శ్రియ నటిస్తున్న ఈ సినిమా తాలూకు ప్రోమోలు , ఫోటోలు, ట్రైలర్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.  యూ ట్యూబ్ లో ఈ సినిమా  ట్రైలర్లు హల్ చల్ చేస్తున్నాయి. ఈక్రేజ్,  సినిమా పట్ల ఒక స్పైసీ ఇమేజ్ ను కలుగాచేస్తున్నాయి.

     ఈ ప్రోమోలు విడుదల అయిన తరువాతనే ఈ సినిమా బిజినెస్ చాలా వేగంగా జరిగింది అని అంటున్నారు. ఈ నెల 10 వ తేదీనే ఈ సినిమా విడుదల కావలసి వుంది. అయితే సెన్సార్ లో ఆలస్యం 10 వ తేదిన ‘తడాఖా’, ‘సుకుమారుడు’  సినిమాల విడుదల కారణంగా ఏర్పడిన థియేటర్ల కొరత వల్ల 17 కు వాయిదాపడింది. ఈరోజున  ఈసినిమాకు  ఎటువంటి సెన్సార్ సమస్యలూ లేకుండా ఈ సినిమా బయటపడగలిగితే,  అనుకున్నది అనుకున్నట్లుగానే 17 విడుదల అయేందుకు అవకాశం వుంది. ” దేవస్థానం ” లాంటి మంచి  సినిమా రూపొందించిన జనార్దన్ మహర్షి దర్సకత్వంలో ఇలాంటి సినిమా రావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఈ సినిమా హిట్ అయితే టాలీవుడ్ సినిమాలలో ఇదో కొత్తరకం ట్రెండ్ అని అనుకోవాలి.

    Tollywood

    Bollywood

    Kollywood