మా హెడ్డింగ్ చూసి తప్పుగా అర్థం చేసుకోకండి. రానా, త్రిష ఇద్దరికీ క్రికెట్ పిచ్చి కాస్త ఎక్కవ. ఐపీఎల్ సీజన్ కదా.. టీవీలకు అతుక్కుపోతున్నారు. క్రికెట్ ఆట ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు.. మైదానంలో వెళ్లి మరీ మ్యాచ్‌ని ఆసాంతం తిలకిస్తున్నారు. ఇద్దరూ కలిసికట్టుగా వెళ్లినా.. ఎవరి టీమ్ వాళ్లదే. రానా... డక్కన్ ఛార్జర్స్‌కి మద్దతు ఇస్తున్నాడు.
త్రిషది చెన్నై టీమ్. చెన్నై- హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ ఇద్దరూ కలిసి కట్టుగా తిలకించారు. అందులో హైదరాబాద్ ఓడిపోయింది. అయినా సరే.. రానా బాధ పడలేదు. త్రిష ఫేవరెట్ టీమ్ గెలిచింది కదా అని సంతోషపడిపోయాడు. రానా, త్రిషల మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ జరుగుతోందని గత కొంతకాలంగా ప్రచారం జరుగింది. ఆ తరవాత సద్దుమణిగింది.
ఇప్పుడు మళ్లీ ఆ వార్తకు కొత్త రెక్కలు రావడం ఖాయం. ఎందుకంటే వీరిద్దరూ మళ్లీ యథావిథిగా జంటగా తెర తిరిగేస్తున్నారు. వ్యవహారం ఎంత వరకూ వచ్చిందో మరి?