జై బోలో తెలంగాణా చిత్రం తో ఒక్కసారిగా లైం లైట్ లోకి వచ్చిన దర్శకుడు ఎన్ శంకర్ అంతకముందు పలు చిత్రాలకు దర్శకత్వం వహించినా ఈ చిత్రం తోనే ఆయనకు మంచి పేరు లభించింది కాని ఈ చిత్రం తరువాత ఏమయిపోయారో మాత్రం తెలియలేదు అయన గురించి ఎక్కడ చిన్న మాటయిన వినపడలేదు కాని తాజాగా మాకు అందిన సమాచారం
ప్రకారం ఈ దర్శకుడు జాక్ పాట్ కొట్టినట్టు తెలుస్తుంది . విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఎన్ శంకర్ దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ నటించనున్నట్టు తెలుస్తుంది . ఈ వార్తే కనుక నిజమయితే ఎన్ శంకర్ జాక్ పాట్ కొట్టినట్టే కదా ఇప్పటికే ఈ చిత్ర కథ ఖరారు అయినట్టు తెలుస్తుంది . మరి ఇది ఎంతవరకు నిజం అన్నది మాత్రం వేచి చూడాల్సిన విషయం .