ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Thursday, 25 July 2013

    'అత్తారింటికి..' డేట్‌ ఇంకా డౌటే!

    Doubts, Attaritniki Daredi, Movie Release
    'అత్తారింటికి దారేది' చిత్రాన్ని ఆగస్ట్‌ 7న విడుదల చేస్తామని రోజుకో ప్రెస్‌నోట్‌ పంపిస్తున్నాడు ఆ చిత్ర నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌. ప్రసాద్‌. ఆ సినిమా ఎప్పుడు వచ్చినా కానీ ఎవడు అయితే జులై 31న రావడం ఖాయమని దిల్‌ రాజు ప్రకటించేశాడు. అయితే అత్తారింటికి దారేది చిత్రాన్ని వారం రోజులు వెనక్కి జరపడానికి ఇంకా ఛాన్స్‌ ఉందని వినిపిస్తోంది. ఇప్పటికీ దిల్‌ రాజు, అల్లు అరవింద్‌, బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ మధ్య మంతనాలు జరుగుతున్నాయట. ఇప్పటికీ కూడా ఆగస్ట్‌ 14కి ఈ చిత్రం వాయిదా పడవచ్చునని అంటున్నారు.

    ఇదిలావుంటే ఆగస్ట్‌ 7 డేట్‌ వల్ల అత్తారింటికి దారేది చిత్రం చాలా ప్రతికూలతలు ఎదుర్కోనుంది. స్టేట్‌లో అత్యధిక థియేటర్లలో ఎవడు ఆడుతుంటుంది కాబట్టి ఇక్కడ అంతగా థియేటర్లు దొరకవు. అలాగే అదే వారంలో షారుక్‌ఖాన్‌ సినిమా చెన్నయ్‌ ఎక్స్‌ప్రెస్‌ రిలీజ్‌ అవుతోంది కాబట్టి దాని వల్ల ఓవర్సీస్‌, కర్నాటకలో ఈ చిత్రానికి థియేటర్లు ఎక్కువ దొరికే ఛాన్స్‌ లేదు. తమిళంలో విజయ్‌ నటించిన తలైవా కూడా అదే వారంలో వస్తోంది కాబట్టి చెన్నయ్‌, యుఎస్‌లో దాని ప్రభావం కూడా ఈ చిత్రంపై పడుతుంది. ఎటు చూసినా కానీ ఆగస్ట్‌ 7 డేట్‌తో అత్తారింటికి దారేది సమస్యలు ఎదుర్కోనుంది. ఇక అన్నిటికీ మించి ఎవడు చిత్రం కనుక బ్లాక్‌బస్టర్‌ టాక్‌ తెచ్చుకున్నట్టయితే మాత్రం 'అత్తారింటికి దారేది' రిలీజ్‌ ఆగస్ట్‌ 14కి వాయిదా పడవచ్చునట. అదండీ సంగతి!

    Tollywood

    Bollywood

    Kollywood