మెంటల్ షూటింగ్ లో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కి గాయాలయ్యాయి. యాక్షన్ సీన్ ని చిత్రీకరిస్తుండగా ఫైటర్ చేతిలోని ఇనుప గడ్డి సల్మాన్ కాలికి గట్టిగా తగిలింది. ఫైటర్ విసరడం, సల్మాన్ ఖాన్ ఒకేసారి అటు తిరగటంతో ఈ ప్రమాదం జరిగినట్టు మూవీ యూనిట్ చెబుతోంది. వెంటనే షూటింగ్ ని నిలిపివేశారు. నెల రోజులుగా రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి నటించిన స్టాలిన్ రీమేక్ గా ఈ చిత్రం రూపొందుతుంది. టైటిల్ మెంటల్ ని జయహోగా మార్చబోతున్నారు. ఆ విషయం పక్కనబెడితే మెంటల్ షూటింగ్ మొదలయ్యాక ఇది మూడోసారి సల్మాన్ కి ప్రమాదం జరగడం. ఫస్ట్ ఫైట్ షూట్ చేస్తుండగా మార్చిలో సల్మాన్ చేతికి గాయమైన సంగతి తెలిసిందే. దీంతో ఇకపై సినిమా షూటింగ్ లో సల్మాన్ ని చాలా కేర్ పుల్ గా చూసుకోవాలని మూవీ యూనిట్ బావిస్తోందట.