ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Saturday, 24 August 2013

    భాగీ కోసం ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్

    Pawan Kalyan Waiting For Bhagyalaxmi
    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అత్తారింటికి దారి మర్చిపోయి తనకు ప్రియమైన భాగీ అదే భాగ్యలక్ష్మి గురించి వెతుకుతూ బెంగళూర్ అంతా కలియతిరుగుతున్నాడు. గబ్బర్ సింగ్ సినిమా పేరు చెప్పగానే పవన్ ఎంతగానో ప్రేమించిన భాగీ ( శ్రుతి హసన్ ) పాత్ర గుర్తుకు వస్తోంది. పవన్ సినిమాలలో ఎంత పేరున్న హీరోయిన్ నటించినా ఆ పాత్రలో ఒదిగి పోవడం వల్ల ఆ పాత్రే కనిపిస్తుందే తప్ప హీరోయిన్ కనిపించదు. ‘గబ్బర్ సింగ్’ సినిమా విషయంలో కూడా శ్రుతి విషయంలో ఇలాగే జరిగింది.

    ప్రస్తుతం రకరకాల ఆలోచనలు తరువాత మన పవర్ స్టార్ ‘గబ్బర్ సింగ్-2’ వైపు అడుగులు వేస్తున్నాడు అనే వార్తలు ఇప్పటికే రావడమే కాకుండా ఈ సినిమా షూటింగ్ నవంబర్ నుంచి సంపత్ నంది దర్శకత్వంలో ప్రారంభం కాబోతోంది అనే స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. కాని బాలీవుడ్ లో వచ్చిన ‘దబాంగ్-2’ సీక్వెల్ లా ఈ కధ ఉండదని, కేవలం గబ్బర్ సింగ్ పాత్ర మాత్రమే కనిపిస్తూ కధనం అంతా కొత్తగా ఉండేటట్లుగా పవన్ జాగ్రత్త పడుతున్నాడని టాక్. ఇన్ని వార్తలు వస్తున్నా ఈ సినిమా విషయంలో పవన్ తో జత కట్టబోయే హీరోయిన్ ఎవరు..? అనే విషయం పై ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మొదటగా ఆ పాత్రను కాజల్ కు ఇద్దామని అనుకున్నా కాజల్ పారితోషికం విషయంలో చుక్కలు చూపెట్టడంతో కాజల్ తప్పుకున్న నేపధ్యంలో ఆ మధ్యలో భాగ్యలక్ష్మి పాత్రకు సమంత, మళ్ళి శ్రుతి హసన్ పేర్లు వినిపించాయి.

    ప్రస్తుతం అందరినీ ఆశ్చర్య పరచే విధంగా ఈ పాత్రకు టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ తో నటిస్తున్న క్రుతి సనన్ పేరును పవన్ తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం పవన్ పొడుగుకు సరిజోడుగా క్రుతి  సనన్ అన్ని విధాలా బాగుంటుందని పవన్ కళ్యాణ్, సంపత్ నంది భావిస్తున్నారట. ఈ వార్తలలో నిజాలు ఎన్నో తెలియవు కాని అప్పటిదాకా గబ్బర్ సింగ్ పక్కన భాగ్యలక్ష్మి కుర్చీ ఖాళీగానే ఉంటూ రకరకాల పేర్లు ఇలా బయటకు వచ్చి హడావుడి చేస్తూనే ఉంటాయి.

    Tollywood

    Bollywood

    Kollywood