విజయమ్మ ఆరోగ్యం విషమంగా తయారయింది, విరమించకపోతే ఆమె ప్రాణాలకు ప్రమాదమని వైద్యులకు చెప్పడం, జైల్లో ఉన్న జగన్ పరిస్థితిని గమనించి తల్లిని దీక్షవిరమించాలని కోరడంతో ఆమె దీక్షను విరమించింది. అయితే సమన్యాయం కోసం తాను ఆదివారం నుంచి జైల్లోనే ఆమరణ దీక్ష చేస్థున్నట్లు ప్రకటించారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు మరో సారి ఉలిక్కిపడ్డాయి.
తల్లి నాకోసం, నాన్నగారు నమ్ముకున్న ప్రజలకోసం ప్రాణ త్యాగానికి సిద్ద పడిందని, అలాంటి అమ్మ తెలుగువారందరికి కావాలని జగన్ అభిప్రాయ పడ్డారట. అందుకు ఆమె ప్రాణాలకు ముప్పు వాటిల్లకూడదని, ఆమె ఆశయ సాధనకోసం కుమారునిగా తన ప్రాణాలన పణంగా పెడుతానని జగన్ చెప్పి ఈ దీక్షకు ఉపక్రమించేందుకు సిద్దమయ్యారు అంటున్నారు వైఎస్సార్ సిపి నేతలు. దీంతో రాజకీయమంతా ఒక్కసారిగా రంగులు మారింది.