ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Saturday, 3 August 2013

    ఉంటే ఉండండి.. పోతే పొండి

    Telangana YSRCP Leaders in Trouble
    జగన్ ని నమ్ముకున్న నేతలు ఇప్పుడు నట్టేట్లో మునిగిపోయారు. అధికారం అరచేతిలో పెట్టుకొని తిరిగే జగన్ బాబు తమ చెంత ఉండగా దేనికి చింత అనుకుంటూ మురిసిపోయి మరీ.. పరిగెత్తుకొచ్చి పార్టీలో చేరిన వారు.. తాము చేసిన తప్పుకు అనుక్షణం క్షోభ అనుభవిస్తున్నారు. నియోజకవర్గాల్లో వ్యక్తిగత పరపతి..  తాము ఉండే పార్టీలో మర్యాద.. హోదాకు తక్కువ లేకపోయినా.. వైఎస్ అంటే అభిమానం.. అన్నా పార్టీలోకి రావొచ్చు కదా అనగానే.. జగన్ బాబు అంతటోడు అడిగాక వెళ్లకపోతే ఏం బాగుంటుందని ఎగురుకుంటూ వెళ్లిన వాళ్లు.. ఇప్పుడు తలలు కొట్టుకుంటున్నారు.

    తెలంగాణ విషయంలో యూటర్న్ తీసుకున్న నేపథ్యంలో.. తమ రాజకీయ భవిష్యత్తుపై వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ నేతల్లో సందేహాలు ముసురుకుంటున్నాయి. కాంగ్రెస్ అంతటి పార్టీనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పచ్చజెండా ఊపిన నేపథ్యంలో.. తమ పార్టీ మాత్రం అందుకు భిన్నంగా జై సమైక్యాంధ్ర అనటం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ‘‘మీ ఇబ్బందులు మీకు ఉండొచ్చు. కానీ.. మా పరిస్థితేంటి? మీరిలా మాట్లాడితే.. మా ప్రాంతంలో మాకు పుట్టగతులు ఉండవ్’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు పార్టీ అధినాయకత్వం ముందు వాపోతుంటే... ‘‘మేమైతే మీ తెలంగాణ గురించి మాట్లాడలేం. ఇప్పుడా పరిస్థితి లేదు. త్వరలో జగన్ బాబు బయటకు వస్తాడు. ఆయన వచ్చేంతవరకు ఓపిక పడితే పట్టండి. లేదంటే మీ ఇష్టం. పార్టీలో ఉంటారా, వెళ్లిపోతారా అన్నది మీ ఇష్టం’’ అంటూ పార్టీ కీలకనేత కటువుగా చెప్పటంతో పార్టీలోకి వచ్చి తామెంత పొరపాటు చేసింది అర్థమై.. కుమిలిపోతున్నారు.

    సభల కోసం లక్షలాది రూపాయిలు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు పెట్టి..  ఈ రోజు ఇంత కటువుగా సమాధానం చెప్పించుకోవాల్సి రావటంపై వారి ఆవేదన అంతా ఇంతా కాదు. తాము అభిమానించే వైఎస్ కుటుంబానికి అండగా నిలవటానికి వచ్చినందుకు తమకు తగిన శాస్త్రే జరిగిందని వారు వాపోతున్నారు. మొత్తానికి మాట మీద నిలబడే వంశం అని చెప్పుకునే స్థితి నుంచి.. రోజూ మాట తప్పటం మీదే ఫోకస్ చేస్తున్న వైఎస్సార్ పార్టీ నేతలు.. ఇకపై.. మాట మీద నిలబడటం మా ఇంటా వంటా లేదంటూ బరి తెగించి మాట్లాడటానికైనా వెనుకాడరేమో.

    Tollywood

    Bollywood

    Kollywood