ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Saturday, 3 August 2013

    తప్పు మీద తప్పు చేస్తున్న టీఆర్ఎస్

    Big Mistakes by TRS, after Telangana state, announcement
    నాలుగురోజుల్లో ఎంత తేడా. నిన్నటి వరకూ కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తిన వారంతా ఇప్పుడు ఆయన్ను తిట్టిపోస్తున్నారు. తెలంగాణ సాధనలో ఒంటరి పోరాటంతో తెలంగాణ రాష్ట్ర సాధన అనే దశాబ్దాల కలను నిజం చేసినందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను అభినంధించినవారే. చివరికి సీమాంధ్ర నేతలు సైతం.. మాకు ఒక కేసీఆర్ ఉన్నట్లయితే.. రాష్ట్రం సమైక్యంగా ఉందని అనుకునే పరిస్థితి. అలా.. అందరి నోట్లలో నానిన ఆయన ఇప్పుడు అందరూ చీదరించుకునే పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామన్న సంతోషాన్ని అనుభవిస్తున్న
    వారికి.. ఉరుము.. పిడుగు లేకుండా ఉద్యోగుల విషయంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. కేసీఆర్  తొందరపడ్డారేమోనన్న భావన టీఆర్ఎస్ పార్టీలోనూ నెలకొంది. ఆ ఫీలింగ్స్ కనిపించకుండా ఉండేందుకు.. ఆ వ్యాఖ్యల తీవ్రత విస్తరించకుండా ఉండే నష్టనివారణ చర్యల్ని కేసీఆర్ మేనల్లుడు హరీశ్ రావు మొదలుపెట్టారు. తమకు ఏ ప్రాంతం వారిపైనా వ్యతిరేకత లేదంటూ వ్యాఖ్యలు చేయటం దీనికి నిదర్శనం. అదే సమయంలో ఆయన.. మరో వివాదాస్పద వ్యాఖ్య చేసేందుకు తెగబడ్డారు. పెద్దగీతను చిన్నగీతగా మార్చటానికి దాని కంటే
    పెద్ద గీత గీయటం అనేది ఒక వ్యూహం. సరిగ్గా దాన్నే హరీశ్ రావు అమలు చేశారు.

    సీమాంధ్రలలో జరుగుతున్న ఉద్యమాల్ని తక్కువ చేయటంతోపాటు.. అసలది సమైక్యాంధ్ర ఉద్యమమే కాదన్న వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజకీయ నేతల ప్రోద్భలంతో అక్కడ నిరసన ప్రదర్శనలు జరుగుతన్నాయని వ్యాఖ్యలు చేశారు. నిజంగా పార్టీల చొరవే ఉంటే.. ఉద్యమ తీవ్రత అక్కడింకా ఎక్కువగా ఉండేది. కానీ.. తమ అధినేత మాటల్ని కవర్ చేసేందుకు.. దాన్నుంచి దృష్టి మళ్లించేందుకు.. సీమాంధ్ర ఉద్యమం మీద వ్యాఖ్యలు చేస్తున్నారు. సుదీర్ఘకాలం ఉద్యమం చేసిన పార్టీ.. ఇప్పుడు ఉద్యమం చేస్తున్న మరో ప్రాంతం వారిని చిన్నచూపు చూడటం.. తక్కువ చేసి మాట్లాడటం సరికాదు. తాజాగా హరీశ్ రావు చేస్తున్న వ్యాఖ్యల పట్ల సీమాంధ్రులు మండి పడుతున్నారు. ఇదిలా ఉంటే.. కేసీఆర్, హరీశ్ రావులు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతున్న తీరుపై టీఆర్ఎస్ నేతలు గగ్గోలు పెడుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో హైదరాబాద్ మీద కేంద్రం మరో నిర్ణయం తీసుకుంటే.. ఇప్పటివరకు తాము పడిన పాట్లు బూడిదలో పోసిన పన్నీరవుతాయని ఆవేదన చెందుతున్నారు.

    Tollywood

    Bollywood

    Kollywood