బహుదూరపు బాటసారీ ఇటురావోయ్ ఒక్కసారి అని ఎవ్వరూ పిలవలేదు. పైగా వేళకానీ వేళ రాకోయి అనుకోని అతిథీ..అంటూ ముక్తకంఠంతో పాడుతున్నారు. అయినా చంద్రబాబు ఆత్మగౌరవ యాత్ర అంటూ బస్సేసుకు బయల్దేరేందుకు సిద్ధమైపోతున్నారు. దీంతో అసలే అంతంత మాత్రంగా వున్న పార్టీ పరిస్థితి మరింత జారుతుందని సాక్షాత్తూ తెలుగుదేశం వర్గాలే భయపడుతున్నాయి. రాష్ట్రవిభజన విషయంలో సమన్యాయం అనే కొత్త లాజిక్ తో రెండు ప్రాంతాల్లోనూ పార్టీని నిలబెట్టుకోవాలన్నది చంద్రబాబు పాకులాట. అదృష్టం బాగుండి, పార్టీ తెలంగాణా నేతలు కూడా దాన్ని నమ్ముతున్నారో, లేక నమ్ముతున్నట్లు నటిస్తున్నారో కానీ, మొత్తానికి పార్టీని అయితే వదిలి పెట్టలేదు. జగన్ స్టాండ్ మారగానే పొలోమని వైకాపాను వదిలిపెట్టినంత పౌరుషం, తెలంగాణా దేశం నేతలు ప్రదర్శించడం లేదు. ఎందుకంటే, చంద్రబాబు మినహా సీమాంధ్ర నేతలు, ఎంపీలు, అందరూ సమైక్య కోసం నానా పోరాటాలు చేస్తున్నారు. వారిని చంద్రబాబు కనుచూపుతొనైనా వారించడం లేదు. మరి అలాంటపడు పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణాకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని ఫలితం ఏమిటి? ఇలా అని ఏ తెలంగాణా నేత కూడా అడగలేదు. అది చంద్రబాబు అదృష్టం.
ఇరు ప్రాంతాలలోనూ తెలుగుదేశం పార్టీ అస్తిత్వాన్ని కాపాడుకోవాలనే చంద్రబాబు ప్రయత్నం ఎంతవరకు సఫలీకృతం అవుతుందో ఎవరికీ తెలియడం లేదు. వై ఎస్ ఆర్ కాంగ్రెస్, తెరాస పార్టీ లను తమ పార్టీలో విలీనం చేసుకుని రెండు ప్రాంతాలలోనూ తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలనే కుట్రతోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవిభజన నిర్ణయాన్ని ప్రకటించిందన్నది తెలుగుదేశం ఆరోపణ. అది ఎంతవరకు నిజమన్నది పక్కన పెడితే చంద్రబాబు మాత్రం రాజకీయంగా ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటునారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. సమైక్యం వైపు మొగ్గితే, తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి, వైకాపా మాదిరిగా మారిపోతుంది. అందులోసందేహం లేదు. మీడియా అండంతో, తమ మాటల లాజిక్ తో చంద్రబాబు ప్రస్తుతానికి కాలం నెట్టుకు వస్తున్నరు. అయితే ఇది ఎంతకాలం అన్నది తెలియదు.
విభజన నిర్ణయం ప్రకటించినప్పటినుంచీ, ఆచి తూచి వ్యవహరిస్తున్న చంద్రబాబు తాజాగా ” తెలుగు ఆత్మగౌరవ యాత్ర ” పేరుతో ఈ నెల 25 నుంచి సీమంద్ర లో బస్సు యాత్ర తలపెట్టారు. ” వస్తున్నా మీ కోసం ” యాత్ర ఎక్కడ ముగిసిందో అక్కడినుంచే ఈ బస్సు యాత్ర మొదలుపెట్టాలని బాబు సంకల్పించారు. అయితే బస్సు యాత్ర విషయం పార్టీ నాయకులకు ఏమీ అంతుపట్టడం లేదు.
తెలంగాణాకు అనుకూలంగా 2008 లో లేఖ ఇవ్వటం ద్వారా చంద్రబాబు కూడా నైతికంగా రాష్ట్రవిభజన లో చంద్రబాబుకు కూడా వాటా వుంది. ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ పదే పదే ప్రస్తావిస్తూ సీమాంధ్ర లో చంద్రబాబు ను దోషిగా నిలబెట్టేందుకు అవకాశం దొరికినప్పుడల్లా ప్రయత్నిస్తోంది. ఈ కారణంగా సీమాంధ్ర లో సహజంగానే బాబు పట్ల ఎంతో కొంత ప్రతికూల పవనాలు వీస్తున్నాయనటంలో సందేహం లేదు.
మరోపక్క విభజన నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రకటించిన వెంటనే సమన్యాయం పేరిట చంద్రబాబు రివర్స్ అయ్యారనీ, ఆయన పక్కా సమైక్యవాది అనీ తెరాస దాడి ప్రారంభించేసింది... అయితే రెండు ప్రాంతాలలోనూ తెలుగుదేశం పార్టీ అపఖ్యాతి పాలు కాకుండా, పార్టీ ప్రతిష్టను కాపాడుకునేందుకు ఇరు ప్రాంతాల ‘దేశం’ నేతలు వారి వారి పరిధిమేరకు తిప్పలు పడుతున్నారు. ప్రత్యేకించి గత వారం రోజులుగా రాజ్యసభలో తెలుగుదేశం ఎం పి లు చేస్తున్న ఆందోళనలు తెలుగుదేశం పార్టీకి సీమాంధ్ర లో సానుకూల పరిస్థితులు కల్పించటంలో ఎంతగానో సహాయపడుతున్నాయి. మరోపక్క క్షేత్ర స్థాయిలో పలువురు దేశం నేతలు, వారివారి నియోజకవర్గాల పరిథిలో సమైక్యం కోసం పోరాడుతూ, జనాల మన్ననలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.
అటు తెలంగాణాలోనూ ఇటు సీమాంధ్ర లోనూ పూర్తి బిగువు తో లేని ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు ఈ బస్సు యాత్ర తలపెట్టడం సరైన నిర్ణయమేనా అన్నది తెలుగు తమ్ముళ్ళు ప్రశ్న. సీమాంధ్రలో చేపట్టే ఈ యాత్ర తో తెలంగాణా లో పూర్తిగా నమ్మకం కోల్పోవటంతో బాటు, బాబు నిజాయితీ పట్ల పూర్తి నమ్మకం లేని సీమాంధ్ర లో సైతం వ్యతిరేకత ను చవిచూడాల్సివస్తుందేమానని వారు భయపడుతున్నారు. యాత్ర సందర్భంగా చంద్రబాబు స్టాండ్ పై ప్రజలు సూటిగా ప్రశ్నించడం ఖాయం. దానికి గోడమీది వాటంగా సమాధానాలు చెబితే సరిపోదు. సరియైన సమాధానం చెబితే కష్టం. ఇదే విషయం చెప్పి, చంద్రబాబును యాత్ర ఆలోచన నుంచి ఆపుదామనుకున్న దేశం నాయకుల ప్రయత్నాలు విఫలమయ్యాయి. పైగా ఈ యాత్ర లో ప్రజలనుండి ఎలాంటి ప్రశ్నలు వస్తాయో ముందే ఊహించి ఆ మేరకు సమాధానాలు తయారుచేసి సిద్ధంగా వుంచమని, పార్టీ కార్యవర్గాన్ని బాబు కొరినట్లు తెలుస్తోంది. బహుశా మరీ తప్పకుంటే, ఈ యాత్రలోనే బాబు తన స్టాండ్ మార్చుకుని, సీమాంధ్రవైపు వస్తారా?