ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Friday, 23 August 2013

    పేరుకు కోటి కానీ ఇచ్చేది అర కోటి

    సినిమారంగం అంటేనే మాయ ప్రపంచం అక్కడ కనిపించేవన్నీ మెరుపులే ఏమి నిజాలు ఉండవు. సినిమా రంగానికి చెందిన మన టాలీవుడ్ కూడా అందుకు మినహాయింపు కాదు. మన టాలీవుడ్ మెగా ప్రొడ్యూసర్స్ లిస్టులో బెల్లంకొండ సురేష్ ఒక ప్రముఖుడు. జయాపజయాలతో సంబందం లేకుండా వరుసపెట్టి సినిమాలు తీయగల శక్తి ఈయనది. మన రాష్ట్రానికి చెందిన చాలామంది రాజకీయనాయకులకు ఈయన బినామి అనే రూమర్ కూడా ఉంది. ఈయన సినిమాలలో నటించే నటీనటులకు, టెక్నిషియన్స్ కు ఈయన ఇచ్చే పారితోషికం కోట్ల రూపాయలలో ఉంటుంది అనే వార్తలు బయటకు వస్తూ అందర్నీ కంగారు పెడుతూ ఉంటుంది. కానీ వాస్తవానికి బెల్లంకొండ బిజినెస్ టెక్నిక్ వేరు అంటారు.

    ఏ కొత్త దర్శకుడు కానీ, హీరోకాని, హీరోయిన్ గాని వారి మొదటి సినిమా విజయవంతం కాగానే ఆ ఆర్టిస్టులకు ఎడ్వాన్సులు  ఇచ్చి పట్టేయడమే కాకుండా ఆ కళాకారులకు 25 లేదా50 లక్షలు పారితోషికంగా ఇచ్చి ఆ హీరో,హీరోయిన్స్ కు తాను కోటి రూపాయలు పారితోషికంగా ఇచ్చానని ప్రచారం చేయడమే కాకుండా ఆ సదరు హీరో హీరోయిన్స్ ని కూడా అలా చెప్పుకోమంటాడట. దీనివల్ల ఆ ఆర్టిస్టులకు క్రేజ్ పెరుగుతుందని వాళ్లకు హితబోధ చేస్తాడట. ఇక లేటెస్ట్ గా మంచు మనోజ్ హీరోగా బెల్లంకొండ నిర్మిస్తున్న కొత్త సినిమాలో అమలపాల్ ను హీరోయిన్ గా ఎంపిక చేసి కోటి రూపాయలు పారితోషికంగా ఇస్తున్నట్లు ప్రచారం చేస్తున్నాడట మన బెల్లంకొండ. ప్రస్తుతం టాలీవుడ్ కానీ కోలీవుడ్ లో కానీ పెద్దగా  ఆఫర్స్ లేని నల్లపిల్ల అమలాపాల్ కు కోటి రూపాయలు ఎవరిస్తారు? అంటూ ఫిలింనగర్ లో జోక్స్ వినిపిస్తున్నాయి....

    Tollywood

    Bollywood

    Kollywood