ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Thursday, 1 August 2013

    ఒప్పందం కుదిరాకే 'విభజన'

    Secret Agreement Between Congress and YSRCP, YSRCP on Telangana, Congress and YSRCP Together in Seemandhra, YSRCP Patch up With Congress, Congress in Telangana, Congress in 2014 elections
    రాష్ట్రం విడిపోతే.. కాంగ్రెస్ కు లాభం ఏమిటి? తెలంగాణలో అత్యధిక ఎంపీ సీట్లు వస్తాయనుకుంటే ఇక్కడ ఉన్నది 17సీట్లే కదా. అత్యధిక సీట్లను పోగొట్టుకొని కొద్ది సీట్ల కోసం ఇంత పెద్ద నిర్ణయాన్ని ఎందుకు తీసుకుందన్నది చాలామందిలో రేకెత్తే ప్రశ్నలు. మనలాంటివాళ్లమే ఇన్ని లెక్కలేసుకుంటే.. కాంగ్రెస్ పార్టీ మరెన్ని లెక్కలు వేసుకోవాలి? చూస్తూ..చూస్తూ ఎవరు ప్రధానమంత్రి పదవి పోగొట్టుకోరు కదా. సీట్ల విషయంలో కాంగ్రెస్ లెక్క పక్కాగా ఉంది. అదెలానంటే.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఇక్కడి 17సీట్లు గంపగుత్తగా కాంగ్రెస్ కే దక్కుతాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మజ్లిస్, టీఆర్ఎస్ లాంటి పార్టీలన్ని అంతిమంగా కాంగ్రెస్ గూటికే చేరేది.

    ఇక.. సీమాంధ్రలో ఉన్న 25సీట్లలో కాంగ్రెస్ వాటాలోకి దాదాపుగా రావనే చెప్పాలి. అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఒకట్రెండు మాత్రం దక్కే అవకాశం ఉంది. అలా చూసుకున్నప్పుడు కాంగ్రెస్ కు భారీగా నష్టపోనుంది. కానీ.. ఇక్కడే అసలు కిటుకు ఉంది. కాంగ్రెస్ ఆశలన్నీ ఇప్పుడు వైఎస్ జగన్ వైపే. సీమాంధ్రలో తమ కంటే బలంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ ఎన్నోకొన్ని స్థానాల్లో గెలవటం ఖాయం. అవన్నీ తమకు దక్కేలా వారు పావులు కదిపారు. దీనికి సంబంధించిన ఒప్పందం కూడా ఇరు పార్టీల మధ్య జరిగిపోయింది.అందుకే తెలంగాణ విబజనపై అంత ధీమాగా కాంగ్రెస్ ముందుకెళ్లింది. పైకి సమైక్యమని బిల్డప్ ఇచ్చి సీమాంధ్ర ప్రజల్ని పక్కదారి పట్టించి.. సీట్లతో కాంగ్రెస్ గూటికి సేఫ్ గా ల్యాండ్ కావాలన్నది వైఎస్సార్ కాంగ్రెస్ వ్యూహంగా చెప్పొచ్చు.

    Tollywood

    Bollywood

    Kollywood