ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Thursday, 1 August 2013

    రంగంలోకి "భారతి"

    YS Bharathi Entry into Politics, Vijayamma and Sharmila Contribution for YSRCP, Bharathi into Direct Politics, YSRCP Leaders Shifting to Other Parties
    సమైక్యవాదులుగా నిలవటం.. తెలంగాణ నేతల నిష్క్రమణలతో డీలా పడ్డ వైఎస్సార్ కాంగ్రెస్ లో మరింత జోష్ నింపేందుకు మరో వ్యక్తి రంగంలోకి రానున్నారు.ఇప్పటివరకు జగన్ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల ప్రజల్లోకి వచ్చారు.తాజాగా.. జగన్ భార్య భారతి రాజకీయాల్లోకి రానున్నారు. ఇప్పటివరకు భర్త అరెస్టు..నిరసన కార్యక్రమాలకు తప్ప నేరుగా ప్రజలతో మమేకం అయ్యింది లేదు.పార్టీ పరిస్థితి నానాటికీ దయనీయంగా మారటం.. ఉన్న నేతలు ఎవరి దారి వాళ్లు చూసుకునేందుకు సిద్ధం కావటంతో పార్టీలో నూతనోత్సాహం తీసుకొచ్చేందుకు తమ దగ్గరున్న ఆఖరి ఆస్త్రాన్ని బయటకు తీయనున్నారు.

    ప్రసంగాల్లో విజయమ్మ ఆకట్టుకునేలా మాట్లాడలేకపోవటం.. అనుకున్నంత స్పందన రాని నేపథ్యంలో షర్మిల ఎంట్రీ ఆ కొరత తీరుస్తుందని భావిస్తున్నారు. పలుమార్లు జాతీయ మీడియాతో మాట్లాడిన ఆమె మంచి వక్తగా పేరొందారు. రాష్ట్ర విభజన నేపధ్యంలో విజయమ్మ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాలను, షర్మిలా సీమాంధ్ర వ్యవహారాల బాధ్యులుగా వ్యవహరించే అవకాశం ఉంది. భారతి ఎంట్రీతో.. ఆమె అత్తకు తోడుగా నిలవనున్నారు. దీని ద్వారా.. బ్యాలెన్స్ అవుతుందని ఆ పార్టీ గంపెడాశలో పెట్టుకుంది. పార్టీ అంతర్గతంగా ఈ వ్యవహారంపై చర్చించినా.. అధికారికంగా మాత్రం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. కాకపోతే.. భారతి ఎంట్రీ తప్పనిసరి అని పార్టీ ముఖ్యులు భావించటం.. అందుకు ఆమె తన అంగీకారాన్ని తెలిపిందని తెలిసింది.

    Tollywood

    Bollywood

    Kollywood