పవన్‌కల్యాణ్ పునరాలోచనలో పడ్డాడు. ఈ పరిస్థితుల్లో తన సినిమాని విడుదల చేయడం శ్రేయస్కరం కాదేమో అని సన్నిహితులతో చర్చలు సాగిస్తున్నాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ప్రకటన నేపథ్యంలోసీమాంధ్రలో ఉద్యమ జ్వాల రగులుతోంది. జనం తీవ్రంగా ఆందోళనలు చేస్తున్నారు. కేంద్రమంత్రి చిరంజీవి కుటుంబీకుల సినిమాలను సీమాంధ్రలో ఆడనివ్వబోమంటూ ప్రజాసంఘాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సినిమా విడుదల చేస్తే భారీ నష్టాలు తప్పవని నిర్మాత, కథానాయకుడు పవన్‌కల్యాణ్ ఆందోళన చెందుతున్నారట. అందుకే ఇంకొన్ని రోజులు సినిమాని వాయిదా వేయడమే మేలని భావిస్తున్నారట. ఈ విషయంపై ఈ రోజు ఓ నిర్ణయం తీసుకొనే అవకాశముందని తెలుస్తోంది. సమైఖ్యాంద్ర ఉద్యమ వేడి చల్లారాకే సినిమాని విడుదల చేయాలని నిర్ణయం తీసుకొంటున్నట్టు తెలుస్తోంది.
Thursday, 1 August 2013
Tollywood

