ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Saturday, 3 August 2013

    ప్రియుడు ఇచ్చిన బహుమతులను అమ్మకానికి పెట్టిన టాప్ హీరోయిన్

    Kathrina Kaif selling her valuable car gifted by Salman
    కత్తి లాంటి కత్రినా ప్రస్తుతం బాలీవుడ్ మిల్కీ బాయ్ రణబీర్ కపూర్ తో డేటింగ్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ మధ్యనే వీరిద్దరూ స్పెయిన్ దేశంలో హాయిగా బీచ్ ఒడ్డున ప్రేమ పక్షులు లా విహరిస్తూ ఉంటే, ఆ ఫోటోలను చాలా పత్రికలు, వెబ్ సైట్లు కత్రీనా రణబీర్ అభిమానుల కోసం పెట్టి నానా హడావిడి చేసాయి. ఈ మధ్యనే తమ విహార యాత్రను ముగించుకుని వచ్చిన వీరిద్దరూ తమ వ్యక్తిగత జీవితాలను ఇలా ఎందుకు బజారుకు ఈడుస్తునారు అంటు మీడియా పై తమ ఆక్రోసాన్ని కూడా వెళ్ళ గక్కారు.

    ఇది చాలదు అన్నట్లుగా కత్రినా మరో ముందడుగు వేసింది ఈ పొడుగు కాళ్ళ సుందరి గతంలో తన మాజి ప్రియుడు సల్మాన్, కత్రినా పుట్టిన రోజు సందర్భంగా ప్రేమతో మోజుపడి ఇచ్చిన అత్యంత విలాస వంతమైన ఖరీదైన కారును, మరికొన్ని చాల విలువైన బహుమతులను అమ్మకానికి పెట్టేసిందట. గతంలో రాత్రిపగలు చెట్టాపట్టాలేసుకొని తిరిగిన సల్మాన్ కత్రీనాలు సహజీవనం చేస్తున్నారంటూ వార్తలు రావడమే కాకుండా వారిద్దరూ పెళ్ళి చేసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ హటాత్ గా కత్రినా తన రూట్ మార్చి రణబీర్ వైపు వెళ్ళిపోయింది.

    ప్రస్తుతం రణబీర్ తో డేటింగ్ చేస్తోంది కాబట్టి సల్మాన్ ఇచ్చిన ఆ విలువైన కానుకలు చూసినప్పుడల్ల రణబీర్ కు బదులు సల్మాన్ గుర్తుకు వస్తున్నాడు కాబోలు అందుకే ఆ బహుమతులు అమ్మేసే పనిలో బిజీగా ఉంది కత్రినా. ఈ వార్త చదివే ఎవరికైనా కారు కొనుక్కోవాలనిపిస్తే డైరెక్ట్ గా కత్రినాను సంప్రదించవచ్చు.

    Tollywood

    Bollywood

    Kollywood