ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Saturday, 3 August 2013

    అత్తారింటికి దారేది సినిమాలో న‌వ్వులే న‌వ్వుల‌ట‌

    Biggest Comedy Entertainer, Attarintiki Daaredi
    ప‌వ‌న్‌కల్యాణ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన అత్తారింటికి దారేది సినిమా సెన్సార్ రిపోర్ట్ బ‌యటికొచ్చింది. ఫ‌క్తు ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాలో భారీస్థాయిలో న‌వ్వులు పండాయంటున్నారు. త్రివిక్రమ్ త‌న‌దైన శైలిలో సంభాష‌ణ‌లు రాశార‌ట‌. అదే స‌మ‌యంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాస్ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని ఆయ‌న‌ని తెర‌పై చూపించ‌డంలో త్రివిక్రమ్ ప‌లు జాగ్రత్తలు తీసుకొన్నట్టు తెలుస్తోంది.

    త్రివిక్రమ్ రాసిన పంచులు ముందుగానే పేలాయి. అంద‌రూ చూడు సిద్ధప్పా... అంటూ పంచులేసుకొంటున్నారు. సినిమా విడుద‌ల‌కు ముందుగానే వినోదాలు ఆస్వాదిస్తున్నారు. ఆ సంభాష‌ణ‌లు థియేట‌ర్లలో మ‌రింత అద్భుతంగా వినిపించాయ‌ట‌. ఆగ‌స్టు9న విడుద‌ల‌వుతున్న ఈ సినిమా గురించి యువ‌త‌రంలో మంచి ఆసక్తి ఉంది. మ‌రి వారి అంచ‌నాల‌ను ఏమేర‌కు రీచ్ అవుతుందో చూడాలి.

    ఇందులో క‌థానాయిక‌లుగా స‌మంత, ప్రణీత న‌టించారు. వారిని తెర‌పై చూపించిన విధానం ప్రేక్షకుల‌కు త‌ప్పకుండా న‌చ్చుతుంద‌ని అంటున్నారు. ప్రణీత ఇప్పటికే నేను బాపుబొమ్మలా అందంగా క‌నిపిస్తాన‌ని చెబుతోంది. స‌మంతకి ఇక తిరుగేలేదు. అమ్మడు తెర‌పై మ‌రింత అందంగా కనిపిస్తాన‌ని చెబుతోంది. ఈ సినిమాకోసం క‌థానాయ‌కుడి ద‌గ్గర్నుంచి నిర్మాత వ‌ర‌కు అంద‌రూ క‌లిసి క‌ట్టుగా కృషి చేశారు. ద‌ర్శకుడు, స‌మంత మిన‌హా మిగ‌తా అంద‌రికీ విజ‌యం అత్యవ‌స‌రం. గ‌త ప‌రాభ‌వాల్ని మ‌రిచిపోవాలంటే కొత్తగా ఈ సినిమా రావాల్సిందే. విజ‌యం సాధించాల్సిందే.

    Tollywood

    Bollywood

    Kollywood