ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Thursday, 1 August 2013

    మరో జిన్నాగా.. కేసీఆర్

    KCR May be Another Zinna, KCR Comments on Telangana State, KCR Development Plans for telangana, Telangana State Division Effects on Andhra Pradesh
    కేసీఆర్ కలలు కన్న తెలంగాణ వచ్చేసింది. ఆయన కోరుకున్నట్లే పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్.. యూపీఏ పక్షాలు పచ్చజెండా ఉపాయి. తెలంగాణ వస్తే ప్రతి ఒక్కరికీ ఉద్యోగం. ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇళ్లు... ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మాటలే చెప్పారు.తెలంగాణ రావాలే కానీ.. రత్నాలు రోడ్ల మీద పోసి అమ్ముతారంటూ హామీలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన వాదన వినిపిస్తుంది. భారతదేశం నుంచి పాకిస్థాన్ విడిపోయే నేపథ్యంలో.. పాక్ నిర్మాణకర్త మహ్మద్ ఆలీ జిన్నా.. ప్రపంచంలోనే అత్యంత ప్రవిత్ర ప్రదేశంగా పాకిస్థాన్ ను మారుస్తానని.. హిందూ, ముస్లిం అన్న తేడా లేకుండా ఓ చక్కటి దేశాన్ని తయారు చేస్తానని చాలా బీరాలే పలికాడు. కానీ.. ఒకసారి పాక్ ఏర్పాడ్డాక..పరిస్థితి ఆయన కంట్రోల్ లోకి లేకుందా పోయింది.  చివరి దశలో ఉన్నప్పుడు జిన్నా విపరీతంగా బాధపడేవారు. పాక్ ని భారత్ నుంచి విడగొట్టి తప్పు చేశానని పలుమార్లు వాపోయారు.

    ఇప్పుడక్కడ మైనార్టీలైన హిందువులపై దాడులు జరుగుతున్నాయి. చాలా ఇబ్బందికర పరిస్థిల్లోకి దేశం జారి పోయింది. చివరికి శాంతిభద్రతలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. తెలంగాణ కోసం చాలామాటలు చెప్పిన కేసీఆర్ సైతం.. చివర్లో తెలంగాణను విభజించి తప్పు చేశానని వాపోతారని చెబుతున్నారు. తెలంగాణ ఏర్పాటునే జాగ్రత్తగా పరిశీలిస్తే.. తెలంగాణ రాష్ట్రం కనుక ఓ సారి ఏర్పడితే... ఇంక భవిష్యత్తు అంతా బంగారమేనని కేసీఆర్ నోటికి వచ్చినన్ని మాటలు చెప్పారు. తెలంగాణ ఏర్పాటు సమయంలోనే ఆయన పాత్ర పరిమితం చేసి.. పార్టీ ఆఫీసుకే యూపీఏ ప్రభుత్వం కూర్చోబెట్టింది.ఇక.. అదికారం కూడా ఆయన చేతుల్లో పెట్టే పరిస్థితే లేదు. అలాంటప్పుడు..ఆయన చెప్పిన మాటలకు.. జరిగే పరిణామాలకు అస్సలు పొంతనే ఉండదు. ఏదైనా భారీ ప్రాజెక్టు చేయటానికి కూడా.. నిధుల సమస్య వెంటాడుతుంది. అదే జరిగితే...అనేక సమస్యలు చుట్టుముట్టటం ఖాయం. చేతిలో అధికారం ఉన్నా.. ఏమీ చేయలేక..అడిగేవాళ్లకు సమాధానం చెప్పలేక తీవ్ర వేదనకు గురి కావటం ఖాయమని చెబుతున్నారు. అలా జరిగినప్పడు.. జిన్నా మాదిరి కేసీఆర్ విభజించినందుకు వేదన చెందటం మినహా మరో మార్గం ఉండదు.

    Tollywood

    Bollywood

    Kollywood