తమ కలల పంట తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిన 24 గంటలు కూడా గడవక ముందే కేసీఆర్ మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో తనతో సమాన హోదా ఇచ్చి.. చెల్లి, చెల్లి అంటూ చెప్పే రాములమ్మ విజయశాంతిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇప్పటికే ఆమె చాలా తప్పులు చేశారని.. ఇప్పటివరకు క్షమిస్తూ వచ్చామని.. ఈసారి మాత్రం చర్య తీసుకున్నామని చెప్పొకొచ్చారు.వాస్తవ దృష్టితో ఆలోచిస్తే కేసీఆర్ చెబుతున్న మాటల్లో పస లేదనిపిస్తుంది.ఇంటి మనిషి ఎవరైనా తప్పు చేస్తే నాలుగు మాటలు అంటారు. అదే పండగలాంటి వాతావరణం ఉంటే.. తర్వాత చూద్దామనుకుంటారు. అలాంటిది అసాధ్యమనుకున్నతెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన రావటం అంటే ఎంత ఉత్సాహం ఉంటుంది. దాన్ని మరిచి మరీ.. అర్థరాత్రిపూట హడావుడిగా విజయశాంతిని పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చిందన్నది ఆసక్తికరం.
దీని కంటే ముందు కేసీఆర్ గురించి ఒక మాట చెప్పుకోవాలి. పార్టీలో ఎవరూ పెద్దగా ఎదగటానికి ఆయన ఒప్పుకోరు. ఆయనతో కలిసి పని చేసిన చాలామంది బయటకు వెళ్లిపోయారు. స్వతంత్రభావాలున్న వారిని ఆయన అంగీకరించరు. వారిని ఏదోలా పార్టీ నుంచి వెళ్లిపోయేలా చేస్తారు. అది విజయశాంతి కావచ్చు.. ఆమెకు ముందు ఇలాంటి బాధితుల లిస్ట్ చాలా పెద్దదే. నచ్చినప్పుడు తనతో సమాన హోదా అంటారు. పార్టీ ఆఫీసులో ఒక గది కేటాయిస్తారు. అదే సమయంలో కేసీఆర్ కు కోపం వచ్చిన వెంటనే మొదట.. ఆఫీసులో కేటాయించిన గదిని లేకుండా చేస్తారు. అప్పటిదాకా గది బయట ఉండే పేరు మాయమవుతుంది. తర్వాత గదికి తాళం పడుతుంది. అలా గతంలో చాలామందిని పొగ పెట్టి పంపేశారు.
ఇంతకీ విజయశాంతి ఏం చేసిందన్నదానికొస్తే.. పార్టీలో తనకు ఏమాత్రం గౌరవం ఇవ్వకపోవటం.. బహిరంగ సభల్లో మాట్లాడనీయకపోవటం లాంటి వాటితో విజయశాంతి హర్ట్ అయ్యారు. మర్యాద లేని చోట ఉండే కన్నా.. తన దారిన తాను చూసుకోవటం మంచిదన్న భావనతో.. బీజేపీ,కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడుతున్నారు. ఆ విషయం తెలుసుకున్న కేసీఆర్ ఆమెపై సస్పెషన్ వేటు వేశారు. ఇంత హడావుడి నిర్ణయం ఎందుకన్న దానికి ఒక కారణం చెబుతున్నారు. విజయశాంతి లాంటి ఛరిష్మా ఉన్న నేత.. పార్టీ నుంచి వెళ్లిపోతున్నానంటూ.. కేసీఆర్ నాయకత్వం మీద ఏదైనా ఘాటు విమర్శలు చేస్తే పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందన్న ఆలోచనతో.. పార్టీ మారే విషయంలో రాములమ్మ నిర్ణయం తీసుకునేలోపే కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ దూకుడుగా విజయశాంతి తన పదవికి రాజీనామా చేసి.. పార్టీపై విమర్శలు చేస్తే అదంతా పార్టీ నుంచి తాము పంపినందుకు అక్కసుతో మాట్లాడుతున్నారన్న వాదనను తెరపైకి తెచ్చేలా సస్పెషన్ నిర్ణయం తీసుకున్నారని చెప్పొచ్చు. పార్టీలో తన కుటుంబసభ్యులు తప్ప ఎవరినీ ఎదగనీయని కేసీఆర్ కు విజయశాంతి ఒక లెక్కనే కాదు కదా.