ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Thursday, 1 August 2013

    మ‌హేష్ స‌ర‌స‌న ఐశ్వర్య

    Mahesh babu with Aishwarya in Aagadu Movie
    మ‌హేష్‌బాబు న‌టించ‌నున్న ఆగ‌డు సినిమాకోసం మ‌రో కొత్త భామ‌ను సంప్రదిస్తున్నార‌ని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకోసం త‌మ‌న్నాని ఎంపిక చేశారు. ఆమెతో పాటు మ‌రో క‌థానాయిక‌కీ ఇందులో చోటుంద‌ట‌. ఆ పాత్రకోసం యాక్షన్ కింగ్‌గా  పేరు తెచ్చుకొన్న అర్జున్ కుమార్తె ఐశ్వర్యని ఎంచుకొన్నట్టు తెలుస్తోంది. ఇటీవ‌లే ద‌ర్శకుడు శ్రీనువైట్ల వెళ్లి అర్జున్‌, ఆయ‌న కుమార్తె ఐశ్వర్యతో మాట్లాడిన‌ట్టు తెలుస్తోంది.

    ఐశ్వర్య త‌మిళంలో విశాల్ స‌ర‌స‌న ఓ చిత్రం చేస్తోంది. మ‌ల‌యాళంలోనూ ఓ చిత్రం చేస్తోంది. కెరీర్ ఆరంభంలోనే ఈ ముద్దుగ‌మ్మకి మ‌హేష్‌బాబు స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం రావ‌డం విశేషం. ఐశ్వర్య కొన్నాళ్లుగా తెలుగు ప‌రిశ్రమ‌పై దృష్టి పెట్టింది. మంచి అవ‌కాశాల కోసం ఎదురుచూస్తూ వ‌చ్చింది. మ‌హేష్ సినిమా కావ‌డంతో ఏమాత్రం ఆలోచించ‌కుండా న‌టించేందుకు నిర్ణయం తీసుకొంది. భ‌విష్యత్తులోమ‌రిన్ని తెలుగు సినిమాలు చేయాల‌ని అమ్మడు ఆశ‌ప‌డుతోంది. 

    Tollywood

    Bollywood

    Kollywood