రవితేజ ఏం చేస్తున్నాడు? తదుపరి సినిమా ఏమిటి? ఎవరితో చేస్తాడు? తదితర అంశాల గురించి కొన్ని రోజులుగా మీడియాలో ఆసక్తికరమైన చర్చ సాగుతూ వస్తోంది. ఆ సందేహాలన్నీ తీరిపోయాయి ఇప్పుడు. మాస్ మహరాజా భారీస్థాయిలోనే స్కెచ్ వేసి పెట్టుకొన్నాడు. నిన్నటిదాకా మన దర్శకనిర్మాతలు ఎవరైనా హిందీకి తీసుకెళ్లితే అక్కడకు వెళతానని చెప్పుకొచ్చిన రవితేజ సైలెంట్‌గా హిందీలో అడుగుపెట్టడానికి ఏర్పాట్లు చేసుకొన్నాడు. బలుపుతో విజయాన్ని సొంతం చేసుకొన్న రవితేజకి ఉన్నట్టుండి హిందీ నుంచి పిలుపొచ్చింది.
సమీర్ కార్నిక్ అనే దర్శకుడు రవితేజని దృష్టిలో పెట్టుకొని ఓ స్ర్కిప్ట్‌ని సిద్ధం చేసుకొన్నాడు. ఇటీవలే ఆ కథను విన్న రవితేజ ఈ సినిమా చేయాలని నిర్ణయించుకొన్నాడట. త్వరలోనే ఆ చిత్రం సెట్స్‌పైకి వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది. రవితేజ నటించిన పలు చిత్రాలు హిందీలో రీమేక్ అయ్యాయి. భారీ విజయాన్ని సొంతం చేసుకొన్నాయి. ఆయన పేరు బాలీవుడ్‌లో చాలా మందికి పరిచయమే. అందుకే రవితేజ హిందీలో నటించాలని నిర్ణయించుకొన్నట్టు తెలుస్తోంది. హిందీతోపాటు తెలుగులోనూ ఈచిత్రం తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాకి హిందీలో 'కౌర్ అండ్ సింగ్' టైటిల్ ను, తెలుగులో 'లక్ష్మి రెడ్డి అనే పేర్లను నిర్ణయించినట్టు సమాచారం.