తన సినిమాకి మరో పేరు వినిపిస్తున్నాడు వెంకటేష్. ఆయన రామ్‌తో కలిసి నటిస్తున్న బోల్‌బచ్చన్‌రీమేక్‌కి మసాలా అనే పేరును ఖరారు చేసినట్టు సమాచారం. ఇదివరకు ఈ సినిమాకి అరడజను పేర్లు పెట్టారు. వాటిలో ఏదీ నచ్చక చివరికి మసాలా అనే పేరును ఖరారు చేసినట్టు సమచారం. క్యాప్షన్ గరమ్ గరమ్ అని నిర్ణయించినట్టు తెలుస్తోంది. మొదట ఈసినిమాకి గరమ్ మసాలా అనే పేరు పెట్టాలనుకొన్నారు.
కానీ సరైన కేప్షన్ కుదరకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకొన్నారు. ఆ తర్వాత గోల్‌మాల్ అనుకొన్నారు. అది కూడా ఖరారు కాలేదు. ఆ తర్వాత వరుసగా సర్వేజనా సుఖినోభవంతు, బ్లాక్‌బస్టర్, నవ్వుకొందాం రా... అని చాలా పేర్లు పరిశీలించారు. కానీ చిత్రబృందమంతా మసాలా పేరుకే ఓటేసి దాన్నే ఖరారు చేశారట. విజయభాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇందులో అంజలి, సాజన్ పదమ్‌సీ కథానాయికలుగా నటిస్తున్నారు.