కృష్ణాజిల్లా అవనగడ్డ నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో టిడిపి ఘన విజయం సాధించింది. టీడీపీ అభ్యర్థి అంబటి శ్రీహరి ప్రసాద్ గెలుపొందారు. ఇండిపెండెంట్ అభ్యర్థి సైకం రాజశేఖర్‌పై 61,644 మెజార్టీతో శ్రీహరి విజయం సాధించారు. అవనిగడ్డ ఉప ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లు 92,309కాగా, టీడీపీ అభ్యర్థి అంబరి శ్రీహరి ప్రసాద్‌కు 75,392 ఓట్లు, స్వతంత్య్ర అభ్యర్థి రాజశేఖర్‌కు 13,638 ఓట్లు వచ్చాయి. అవనిగడ్డ శాసనసభకు బుధవారం జరిగిన ఉప ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు మచిలీపట్నంలోని హిందూకళాశాలలో ఈరోజు జరిగింది. అవనిగడ్డ శాసన సభ్యుడు అంబటి బ్రాహ్మణయ్య మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది.