రాజకీయ ఉద్యమాల నేపధ్యంలో భారీ సినిమాల అతిగతి లేకపోయినా టాప్ హీరోలకు డిమాండ్ తగ్గడం లేదని జరుగుతున్న పరిణామాలు చూస్తే అర్ధం అవుతోంది. పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ సినిమాకు దారి ఎప్పుడో హీరో పవన్ కే తెలియని పరిస్థితిలో పవన్ కు మాత్రం ఏమీ క్రేజ్ తగ్గడం లేదు సరికదా, రోజురోజుకు ఆ క్రేజ్ పెరిగిపోతోంది అనడానికి లేటెస్ట్ గా టాలీవుడ్ లో వినబడుతున్న వార్తలను ఉదాహరణగా చెప్పుకోవాలి. ప్రస్తుతం పవన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘గబ్బర్ సింగ్ 2’ సిక్వేల్ స్క్రిప్ట్ విషయంలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇంకా మొదలు కాకుండానే మరొక సినిమాను పవన్ ఒప్పుకున్నాడు అంటూ అధికారికంగా ఆ నిర్మాణ సంస్థ ప్రకటించింది.
పివిపి బ్యానర్ లో పొట్లూరి వి ప్రసాద్ నిర్మించే కొత్త సినిమాకు పవన్ నటించడానికి అంగీకరింప చేయడానికి ఇప్పటి వరకూ టాలీవుడ్ లో ఏ హీరో తీసుకొని భారీ పారితోషికం 18 కోట్లు ఆఫర్ చేసినట్లు గా తెలుస్తోంది. ఫిల్మ్ ఫైనాన్షియర్ గా తన జీవితాన్ని ప్రారంభించిన ప్రసాద్, ఈ మధ్యనే రవితేజ తో ‘బలుపు’ సినిమా తీసి తన బలుపు చూపెట్టి హిట్ కొట్టిన తరువాత ఆయన చూపులు పవన్ పై పడ్డాయి. ఒకే సారి భారీ పారితోషికంతో పవన్ కాల్ షీట్స్ లను సొంతం చేసుకున్న ప్రసాద్, తన సినిమాను వచ్చే సంవత్సరం లో మొదలు పెడతారని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి మరొక ట్విస్ట్ ఏమిటంటే..! ఇప్పటి వరకూ ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాల దర్శకుడిగా పేరుగాంచిన శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తాడని అంటున్నారు. దీనికి సంబంధించి శ్రీకాంత్ అడ్డాల చెప్పిన స్టొరీ లైన్ ను కూడా పవన్ ఒకే చేయడంతో ఈ సినిమా స్క్రిప్ట్ విషయం పై శ్రీకాంత్ అడ్డాల బిజీగా ఉన్నాడని అంటున్నారు.
ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలకు చిరునామాగా ఉండే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం లో పవన్ ఇప్పటి వరకూ తన కెరియర్ లో పోషించని ఒక సున్నితమైన పాత్రను పోషిస్తాడని అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ ఎవరు అన్నది ఇప్పటికీ కూడా సస్పెన్స్ గానే ఉంది. రోజురోజుకి సినిమా నిర్మాణ వ్యయాలు పెరిగిపోయి సినిమాలు తీయడం కష్టమై పోతోంది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో కేవలం ఒకే ఒక్క సినిమా కోసం ఒక హీరోకు ఏకంగా 18 కోట్లు ఆఫర్ చేయడం టాలీవుడ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది. పవన్ లేటెస్ట్ మూవీ ‘అత్తారింటికి దారేది’ సినిమా విడుదల కాకుండానే పవన్ క్రేజ్ ఇలా ఉంటే నిజంగా ఈ సినిమా అందరూ అనుకున్నట్లుగా సూపర్ హిట్ అయితే మరి మన ఆరడుగుల బుల్లెట్ రేంజ్ ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.