ముఖ్యమంత్రి తీరు వెనుక ఆశ్యర్యకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. సమైక్యవాదమంటూ తెరపైకి కనిపిస్తున్న ముఖ్యమంత్రి ముందు రూపం వెనుక తెలంగాణ రూపం మరోటి దాగిఉందన్న విషయం తెలుసుకుని కాంగ్రెస్ హైకమాండే కంగుతింటోందట. సిఎం డిల్లీ పర్యటనలను నిషితంగా పరిశీలించిన హైకమాండ్ కు ఈ అసలు రహస్యం తెలిసిందంటున్నారు. ఇంత డేంజర్ ఆలోచన వెనుక ముఖ్యమంత్రి వ్యూహమేంటి అన్నది కాంగ్రెస్ వర్గాలకే అంతుచిక్కడం లేదంటున్నారు.
ఈ అనుమానాలకు కారణాలేంటి, ఇప్పుడు తెలంగాణ వాళ్లంతా కాంగ్రెస్ వారితో సహా ముఖ్యమంత్రి పై గుర్రుగా ఉన్నారు. కారణం ఆయన రాష్ట్ర విభజనను అధిష్టానం అభిమతానికి విరుద్దంగా ఖండిస్తున్నారు. దీంతో ఆయనను కాంగ్రెస్ సస్పెండ్ చేస్తోందన్న వార్తలు కూడా ఓదశలో వినిపించాయి. ఆయన రాజీనామా కూడా చేసేసాడన్న వార్తలు ఓదశలో వెలుబడ్డాయి. అలాంటిది కాంగ్రెస్ కు రాజీనామాలు చేయాలనుకుంటున్న మంత్రులను, ఎమ్మెల్యేలను నిలవరిస్తుండడమే కాకుండా, ఇంత ఎదురుతిరిగినా కూడా అధిష్టానం ఆయనను ఏమి అనకపోతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
ఇక తెలంగాణలో వైఎస్సార్ సిపి, టిఆర్ఎస్ వంటి పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరుతున్నారు. వీరికి తెలంగాణలో జానారెడ్డి, మాజిపిసిసి అద్యక్షుడు డి.శ్రీనివాస్ వంటి అగ్రనేతలు ఎందరో ఉండగా కూడా ఢిల్లీకి ముఖ్యమంత్రి వెల్లినప్పుడే ఆయన సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతున్నారు. టిఆర్ఎస్ ను విజయశాంతి అలాగే చేరారు. అంతే కాదు హైదరాబాద్ వచ్చాక కూడా విజయశాంతి సిఎం క్యాంపు కార్యాలయానికి వెల్లి కలిసారు. అంతే కాదు తాజా ఢిల్లీ పర్యటనలో కూడా కొండా సురేఖ, మహీదర్ రెడ్డి వంటి వారు కూడా సిఎం సమక్షంలోనే కాంగ్రెస్ లో చేరారు. అంతకు ముందు ఇక్కడ సిఎం ను వారు కలిసారు.
అంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణలో తన కోటరీని పెంచుకుంటున్నాడన్న మాట. రాష్ట్రం విడిపోతుందని ఇంత గట్టిగా వాదం వినిపిస్తున్న తరుణంలో సీమాంద్రకే పరిమితమవుతానని చెపుతున్న ముఖ్యమంత్రి ఇటు తెలంగాణలో తన బలం పెంచుకుంటూ, అటు సీమాంధ్రలో తన వర్గాన్ని కాపాడుకోవడం వెనుక దాగి ఉన్న రహస్యమేంటి అన్నది ఎవరికి అర్థం కావడం లేదు. అంటే రాష్ట్ర విడిపోదని ఆయనకు తెలుసా... అందుకే 2014 ఎన్నికలకు రాష్ట్ర వ్యాప్తంగా తన సిఎం అభ్యర్థిత్వానికి ముప్పురాకుండా జాగ్రత్త పడుతున్నాడా... అన్న సందేహాలు కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.