ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Sunday, 29 September 2013

    జగన్ తెలివితేటలు బాబుకు లేకపోయాయి

    జగన్ తెలివితేటలు బాబుకు లేకపోయాయి
    తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా చాలా తప్పులు చేసిందని ఇప్పుడిప్పుడనిపిస్తోంది. టీఆర్ఎస్ మాయలో కొట్టుకుపోయి.. తెలంగాణ వాదానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత కన్నా ఎక్కువ ఇచ్చి ఇబ్బందులు కొని తెచ్చుకొందేమోనని అనిపిస్తోంది. ఇప్పుడు జగన్ పార్టీ పరిస్థితిని గమనిస్తే.. తెలుగుదేశం తప్పు చేసిందేమోనని అనిపిస్తోంది.

    ఆది నుంచి తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రసమితి మాయలోపడింది. తెలంగాణ వాద అనుకూలమైన టోన్ ను వినిపించకపోతే.. తెలంగాణలో పార్టీకి మనుగడ ఉండదనే భ్రమలో  కూరుకుపోయింది. ఈ భయంతోనే తెలంగాణ కు అనుకూల లేఖను కూడా ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ భయానికి, జగన్ కు తేడా ఇక్కడే కనిపించింది. తెలంగాణలో ఉన్న సమైక్యవాదాన్ని గుర్తించి ముందుకెళ్లాడు జగన్ మోహన్ రెడ్డి. కానీ బాబు తెలంగాణ వాదులను ఆకర్షించడానికి ప్రయత్నించాడు.

    ఈ ప్రయత్నంలో జగన్ కఠోర తెలంగాణ వాదులను, తెలంగాణ అంశం మీద రాజకీయ ప్రయోజనం పొందుదామనే వారిని కోల్పోయినా.. సమైక్యవాదులను ఆకర్షించగలిగాడు, సీమాంధ్రలో నిలబడి.. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కూడా పట్టును నిరూపించుకునేలా ఉన్నాడు. అయితే చంద్రబాబు తెలంగాణ వాదులను ఆకర్షించబోయి.. సమైక్యవాదులను దూరం చేసుకున్నాడు. అలాగని తెలంగాణ వాదులను కూడా పూర్తి స్థాయిలో ఆకర్షించలేకపోయాడు.

    ఒకవేళ చంద్రబాబు ఆదిలోనే సమైక్యాంధ్రకు జై కొట్టి ఉంటే.. పరిస్థితి ఇలా ఉండేది కాదు. కొన్ని రోజులకైనా తెలంగాణలో పరిస్థితి కుదట పడేది. ఎందుకంటే.. ఇక్కడ టీడీపీకి సహజమైన ఓటు బ్యాంకుంది. ఇక సీమాంధ్రలో తిరుగులేకుండా ఉండేది. ఓవరాల్ గా తెలుగుదేశం ప్రభంజనమే ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయింది!

    Tollywood

    Bollywood

    Kollywood