రాష్ట్ర విభజనకు సంబంధించి కేబినెట్ నోట్ ఆగాలంటే... ఎంపీలు విధిగా రాజీనామా చేయాల్సిందేనని.. అందరూ అంటున్నారు. ఒకసారి తమ రాజీనామాలు ఆమోదింపజేసుకునే వరకు వెళ్లి... స్పీకరు అందుబాటులో లేకపోవడం వల్ల.. ఆగిన కాంగ్రెసు ఎంపీలు కూడా.. ఎట్టి పరిస్థితుల్లోనూ 30వ తేదీ అపాయింట్‌మెంట్‌లోనైనా ఆమోదింపజేసుకుని.. ఒత్తిడిపెంచాలని అనుకుంటున్నారు.
అయితే జగన్‌కు చెందిన వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ మాత్రం.. రాజీనామాలు ఆమోదింపజేసుకునే దిశగా అంత ఆసక్తిగా ఉన్నట్లు లేదు. వైకాపాకు ఇద్దరు ఎంపీలు ఉన్నారు. జగన్, మేకపాటి కాగా, ఇద్దరూ రాజీనామాలుచేశారు. పెండిరగ్‌లో ఉన్నాయి. జగన్ జైలునుంచి విడుదల అయిన తర్వాత.. తమ రాజీనామాల ఆమోదానికి లేఖ రాయనున్నట్లు మేకపాటి ఒక నామమాత్రపు లేఖరాసి అంతటితో ఊరుకున్నారు. అయితే వారు రాజీనామాలు ఆమోదింపజేసుకోవడం మీద మాత్రం శ్రద్ధ పెట్టడం లేదు. సమైక్య లక్ష్యం దిశగా జగన్ పార్టీ వలన జరుగుతన్న మరో పెద్దనష్టం కూడా ఉంది. కాంగ్రెసు ఎంపీ సబ్బం హరి వైకాపాకు చెందిన వాడే. జగన్ అనుచరుడిననే, వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీ తరఫున పోటీచేస్తాననే చెప్పుకుంటూనే ఉన్నారు. అలాంటి సబ్బం హరి ఇప్పటివరకు కనీసం రాజీనామా చేయకపోవడం కూడా జగన్ చిత్తశుద్ధి మీదనే రిఫ్లెక్ట్ అవుతోంది. హరితో రాజీనామా చేయిస్తే జగన్, కాంగ్రెసు ఎంపీల మీద ఒత్తిడిపెంచడం చాలా ఈజీ అవుతుంది. ఆ విషయం పట్టించుకోకపోగా, జగన్‌కు తన రాజీనామా ఆమోదం పొందడం కూడా ఇష్టం లేదని సమాచారం.
పార్లమెంటులో బిల్లు చర్చకు వచ్చినప్పుడు... వైకాపా తరఫున ఫ్లోర్ లీడర్ హోదాలు ప్రసంగం చేయడానికి అవకాశం మిస్సవుతామని ఆయన రాజీనామా ఆమోదం పొందడాన్ని ఇష్ట పడడం లేదని అంటున్నారు. పార్లమెంటులో విభజన ప్రసంగం చేయడం ద్వారా మంచి మైలేజీ సాధించవచ్చునని.. ప్రజల దృష్టిలో చాలా కీర్తి ప్రతిష్టలు దక్కే అవకాశం ఉన్నదని.. అందువలన.. రాజీనామా ఆమోదం పొందకుండా ఉండేందుకే జగన్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు.
Search Terms: Jagan may not Resign to his MP Seat, Jagan Mohan reddy got Bail, jagan on seemandhra agitation, YSRCP leaders to submit resgination