ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Thursday, 5 September 2013

    అమ్మల కుమ్మక్కు ‘బాబు’ల కోసమే

    Jagan as CM and Rahul Gandhi as PM
    ఇది ప్రపంచానికి తెలియని సంగతి కాదు.. కానీ చందబ్రాబునాయుడు మరోసారి ఈ వ్యవహారాన్ని ఎలుగెత్తి ప్రపంచానికి చాటిచెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ అమ్మలిద్దరూ సోనియమ్మ, విజయమ్మ అయితే.. బాబులిద్దరూ రాహుల్‌, జగన్‌ కావడం విశేషం. వీరు అటు కేంద్రాన్ని ఇటు రాష్ట్రాన్ని పంచుకోవాలని చూస్తున్నారు. కుమ్మక్కు తెలిసినదే అయినా.. దాని వెనుక గల విలక్షణ పునాదులను మనం సాకల్యంగా చర్చించుకోవాల్సిన సమయమిది.

    కాంగ్రెస్‌, వైకాపా రెండూ కుమ్మక్కు రాజకీయాలు నడిపిస్తున్నాయన్న పుకార్లు  లేదా వార్తలు ఇవాళ్టివి కాదు. చాలా కాలంనుంచి ఉన్నవే. రెండు పార్టీలు పైకి భయంకరంగా ఒకరినొకరు తూలనాడుకుంటూ ఉన్నప్పటికీ లోలోన కుమ్మక్కు కావడం మన దేశ రాజకీయాల్లో కొత్త విషయం ఎంత మాత్రమూ కాదు. అయితే ఇక్కడ చంద్రబాబు భాషలో చెప్పాలంటే తల్లి కాంగ్రెస్‌, పిల్ల కాంగ్రెస్‌ పేర్లతో చెలామణీ అవుతున్న ఈ రెండు పార్టీలు కుమ్మక్కు కావడానికి సిద్ధాంతాల సారూప్యత లేదా, రాజకీయ అవసరాలు, రాజకీయ బలాబలాల పంపకం. లాంటి సశాస్త్రీయమైన కారణాలు ఎంతమాత్రమూ లేకపోడం ఇక్కడ వింత.

    ప్రత్యేకించి ఈ రెండు పార్టీల కుమ్మక్కు వ్యవహారం కేవలం ఇద్దరు కొడుకులకు సంబంధించిన, ఇద్దరు అమ్మలకు సంబంధించిన, రెండు కుటుంబాలకు సంబంధించిన, రెండు కుటుంబాల అధికార లాలసతకు సంబంధించిన వ్యవహారంగా మాత్రమే ఆపునాదులపై నిర్మింపబడడం విశేషం.

    ఇద్దరు అమ్మలు` సోనియా, విజయలక్ష్మి లోపాయికారీగా కుమ్మక్కు అవుతున్నారంటే.. ఆమె కొడుకు రాహుల్‌ను ప్రధాని చేయాలి. ఈమె కొడుకు జగన్‌ను జైలునుంచి బయటకు తీసుకువచ్చి ముఖ్యమంత్రిని చేయాలి. రాష్ట్రం ముక్కలై తమకు ఒక్క ముక్క మిగిలినా చాలు. ముఖ్యమంత్రిగా ఏలుకోవడం ఈ అమ్మ లక్ష్యం. పైకి ఎన్ని రకాల మాటలు చెబుతున్నా ఈ రెండు బాబుల లక్ష్యాల కోసం ఈ ఇద్దరు అమ్మలు... ఇతర ప్రజా, సమాజ, రాష్ట్ర, దేశ ప్రయోజనాలను అన్నిటినీ తుంగలో తొక్కి లోపాయికారీగా వ్యవహరిస్తున్నారనేది ప్రజల అర్థం చేసుకునేలోగా సమయం మీరిపోతుంది.

    Tollywood

    Bollywood

    Kollywood