ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Thursday, 5 September 2013

    చారానా కోడికి.. బారానా మసాలా!!

    Jagan Back to Jail
    చారానా కోడికి బారానా మసాలా అంటూ తెలంగాణలో ఓ మొరటు సామెత ఉంది. ప్రస్తుతం సమైక్య రాష్ట్రం కోసం లేదా సందర్భానుసారంగా సమన్యాయం కోసం వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన నిరాహార దీక్ష వ్యవహారం కూడా అచ్చం ఆ సామెతకు సరిపోలినట్లే ఉంది. వైఎస్‌ జగన్‌ ఏడు రోజుల నిరాహార దీక్ష చేసి అచ్చం అయిదురోజుల చికిత్స అందుకున్నాడు.

    వివరాల్లోకి వెళితే.. సమైక్యాంధ్ర కోసం ఏడు రోజుల దీక్ష చేసినందున... సమైక్యాంధ్ర వాదులందరి మద్దతు తన పార్టీకి మాత్రమే దక్కాలని వైఎస్‌ జగన్‌ ఆరాటపడుతుండవచ్చు గాక.. కానీ నిజానికి ఇప్పటిదాకా అటు కుప్పం నుంచి ఇటు ఇచ్ఛాపురం వరకు జరిగిన దీక్షలను లెక్క కడితే.. నాయకులు, సామాన్యులు అందరూ చేసిన నిరాహార దీక్షలన్నీ కలిసి కొన్ని వందల రోజులు లెక్కతేలుతాయి. కడుపు మాడ్చుకుని ఒక లక్ష్యం కోసం దీక్ష చేయడం అన్నాక.. అది ఎవ్వరి కడుపైనా ఒక్కటే! జగన్‌ కడుపుకు ఎక్కువ ఆకలి ఉంటుందని, మారుమూల పట్టణంలో దీక్షకు కూర్చున్న రిక్షా కార్మికుడి కడుపుకు తక్కువ ఆకలి ఉంటుందని అనుకోవడం తప్పు. మొత్తానికి జగన్‌ అందరికంటె ఎక్కువగా ఏడు రోజుల దీక్ష చేశారు.

    సాధారణంగా పోలీసులు అయిదో రోజు రాత్రి వరకు నాయకులు ఎవ్వరు దీక్షలు చేస్తున్నా వారిని ఆస్పత్రికి తరలించి, బలవంతంగా ఫ్లూయిడ్స్‌ ఎక్కించి, దీక్ష భగ్నం చేసి ఇంటికి పంపేస్తూ వచ్చారు. జగన్‌ ను కూడా అదే తీరుగా అయిదోరోజు ఆస్పత్రికి తరలించారు. అయితే జగన్‌ అక్కడ పట్టుబట్టి ఫ్లూయిడ్స్‌ పెట్టించుకోకుండా రెండురోజుల పాటూ మొండికేయడం వలన.. ఆలస్యం జరిగింది.

    అయితే ఆయన చేసిన రెండు రోజుల అదనపు దీక్ష వలన ఏకంగా అయిదురోజుల పాటూ ఆయనకు ఆస్పత్రిలోనే చికిత్సలు అందించాల్సి వచ్చింది. అయిదు రోజుల దీక్షలు చేసిన నాయకులంతా భగ్నం కాగానే ఒక్కరోజు కూడా ఆస్పత్రిలో గడపకుండా ఇళ్లకు వెళ్లిపోయిన వారే..! వైఎస్‌ జగన్‌ మాత్రమే రెండు రోజుల అడిషనల్‌ దీక్ష చేసినందుకు అయిదురోజుల బోనస్‌ బెడ్‌రెస్టు పొందగలిగారు. పైగా కోర్టు వారి అనుమతితో భార్య సపర్యలు అందుకుంటూ.. ఆమెతో కలిసి పార్టీకి సంబంధించిన శిఖరాగ్ర వ్యూహరచనను సాగిస్తూ అయిదురోజుల సుదీర్ఘ సమయం గడపడానికి ఆయనకు వెసులుబాటు దొరికినట్లు అయింది.
    అందుకే జగన్‌ దీక్ష గుర్తుకు వచ్చినప్పుడు చారానా కోడికి బారానా మసాలా అనే సామెత గుర్తుకు వస్తుంది.

    Tollywood

    Bollywood

    Kollywood