ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Thursday, 26 September 2013

    జగన్ కి ఓ లెక్కుంది.. దానికో రీజన్ ఉంది

    Jagan Planning for Gaining Power, Congress and YSRCP Game on Telangana Issue, Jagan in Seemandhra, YSRCP MLA Resignations, Jagan Patch p with Sonia Gandhi
    జగన్ బెయిల్ మీద బయటకొచ్చాడు. అదేం చిత్రమో.. వచ్చిన రోజు నుంచి చాలా విషయాల మీద క్లారిటీ వచ్చేస్తుంది. నిన్నమొన్నటివరకు ఉన్న సందేహాలు తీరిపోతున్నాయి. సీమాంధ్రలో ఉద్యమం అంత పీక్ లెవల్లో సాగుతున్నా.. అధిష్ఠానం అస్సలు లెక్క పెట్టటం లేదెందుకన్న ప్రశ్నకు సమాధానం దొరికింది. కాంగ్రెస్ అధినాయకత్వం ఎంత పక్కా ప్లాన్ చేసి మరీ విభజన ఎపిసోడ్ కి తెర లేపిందో తెలుస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే.. నిన్నటి వరకు ఉప్పు.. నిప్పులా ఉన్న తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ ల అనుబంధం మాటల్లో చెప్పనలవి కానిది. ఇంతకీ కాంగ్రెస్ – జగన్ ల మధ్య లెక్కేమిటి? దానికి జగన్ రీజన్ ఏమిటి? అన్నది ఆసక్తికరంగా మారింది.

    మొండితనం.. విపరీతమైన స్వాభిమానం.. శత్రువును ఎట్టి పరిస్థితుల్లో క్షమించలేకపోవటం.. తాను తప్పితే మరెవరూ గొప్పవాళ్లు కాదన్న ఓవర్ కాన్ఫిడెన్స్ కలిపితే జగన్ గా ఆయన్ను తెలిసిన వాళ్లు అభివర్ణిస్తుంటారు.  అలాంటి వ్యక్తి కాంగ్రెస్ చీఫ్ సోనియమ్మతో రాజీకి వచ్చారా? తన అనుకున్నది సాధించుకోవటం కోసం సోనియాతో సైతం తలపడేందుకు సిద్ధమైన ఆయనకు కాలం పాఠాలు నేర్పిందా? సమయం కోసం వేచి చూడటం అవసరమవని.. తనది కాని సమయంలో ఏం చేసినా ఎదురుదెబ్బ తప్పదన్న విషయం ఆయనకు తెలిసి ఉండవచ్చు.

    ప్రజాభిమానం ఎంత ఉన్నా.. అనుకున్నది.. అనుకున్నట్లు సాగాలంటే అధికారం అత్యవసరమని ఆయనకు అర్థమై ఉండొచ్చు. పదహారు నెలల జైలు జీవితం ఆయనకు అధికారం మీద మరింత మోజును తెచ్చిందని చెబుతున్నారు. దాన్ని సాధించటం కోసం మొండితనంతో ముందుకెళ్లటం కంటే వ్యూహాత్మకంగా అడుగులు వేయటం తప్పనిసరి అనుభవ పాఠాలు నేర్పి ఉంటాయి. అందుకే.. కాంగ్రెస్ తో జత కట్టేందుకు తొలుత ససేమిరా అన్న ఆయన తర్వాత ఓకే చెప్పటాన్ని ఇందుకు నిదర్శనంగా ఆయన్ను బాగా తెలిసిన వారు చెబుతుంటారు.

    తాను జైలు జీవితం గడుపుతున్న సమయంలో జరిగిన రాష్ట్ర వ్యవహారాలు ఆయన్ను కలిచివేసి ఉంటాయి. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలన్న తన కల ఎప్పటికి సాధ్యం కాదని ఆయనకు అర్థమై ఉంటుంది. అదే సమయంలో విభజన అనంతరం అయినా అధికారం చేతిలో లేకపోతే.. తన రాజకీయ భవిష్యత్తు గందరగోళంలో పడుతుందన్న ఆలోచనే కాంగ్రెస్ తో దోస్తీకి పురికొల్పి ఉండొచ్చు. అందుకే విభజనకు తన వంతు చేయూత ఇచ్చేందుకు కాంగ్రెస్ తో చేతులు కలిపారు. సమైక్యాన్ని వల్లించే జగన్ పార్టీ.. విభజనకు అత్యంత అనుకూలమా అని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రాష్ట్ర విభజన అనివార్యమైని అర్థమయ్యాక.. దాన్ని అడ్డుకునేందుకు శక్తియుక్తుల్ని ఖర్చు చేయటం నీటి ప్రవాహానికి ఎదురెళ్లటమేనని తెలిసి ఉంటుంది. అందుకే.. నీటి ప్రవాహంతో కలిసి ప్రయాణిస్తే అధికారం తథ్యమని భావించి ఉండొచ్చు. అందుకే విభజనకు సూత్రప్రాయంగా అంగీకరించారని చెబుతారు.

    సమైక్యం గురించి.. తెలంగాణలో పార్టీ క్యాడర్ ను వదులుకునేందుకు సిద్ధపడ్డారు కదా అన్న సానుకూల దృక్ఫధం అవసరం లేదు. తెలంగాణలో ఆయన పార్టీని వదులుకుంటే.. సీమాంధ్రలో పార్టీని పణంగా పెట్టటానికి అంత పెద్ద కాంగ్రెస్ రెఢీ కావటం ఆయన్ను ఆలోచనల్లో పడేసి ఉండొచ్చు. 2014 ఎన్నికల్లో అధికారమే పరమావధిగా మారి తెలంగాణను తల్లి కాంగ్రెస్ కు అప్పజెప్పి.. సీమాంధ్రను పిల్ల కాంగ్రెస్ చేతికి కట్టబెట్టేందుకు అత్యున్నత స్థాయిలో నిర్ణయం జరిగిపోయాక.. సాధారణ ప్రజలు మాత్రం ఏం చేయగలరు? ఆ వ్యూహంలో పావులుగా మారటం తప్ప.

    అందుకే.. తన పార్టీ ఎమ్మెల్యేలను ఎరగా వేయబోతున్నారు. ఎలా అంటే.. తన దగ్గరున్న 17 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామాలను ఆమోదించకునేలా చేయటం ద్వారా రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీలో వీగిపోయేలా చేయటంతో కీలకపాత్ర పోషిస్తారు. బయటకు మాత్రం సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా.. తమ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసిన త్యాగమూర్తులుగా కనిపిస్తారు. కానీ.. అసలు చిత్రం మాత్రం వేరే ఉంటుంది.

    విభజన బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందటం తప్పనిసరి. ఒకవేళ వీగిపోయినా.. కేంద్రం తలుచుకుంటే విభజన చేయగలదు. కానీ..అది నైతికంగా సరికాదు. అదే అసెంబ్లీలో విభజన బిల్లు నెగ్గితే దాన్ని వంకపెట్టేవారే ఉండరు. అలా జరగటం అసాధ్యం. ఎందుకంటే తెలంగాణ కంటే కూడా సీమాంధ్ర ఎమ్మెల్యేలే ఎక్కువ. ఈ నేపథ్యంలో విభజనకు ఆమోదం లభించటం అసాధ్యం. తెలంగాణపై కాంగ్రెస్ ప్రకటనకు ముందు సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆలోచనలు వేరుగా ఉన్నాయి. విభజనపై సీమాంధ్రలో పెద్దగా వ్యతిరేకత ఎదురుకావచ్చని భావించారు. దానికి భిన్నంగా పరిస్థితులు ఉండటంతో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఆలోచనలో పడ్డారు. అప్పటివరకు అసెంబ్లీలో తీర్మానానికి తమ వంతు సాయం చేస్తామని అధిష్ఠానానికి మాట ఇచ్చివారు.. విభజనకు సహకరించటం తమ వల్ల కాదని తేల్చి చెప్పారు. అప్పుడే వైఎస్సార్ కాంగ్రెస్ సీన్లోకి వచ్చింది. విభజన వ్యవహారంలో తమకు సహకరిస్తే.. ఉభయులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పటంతో జగన్ ఓకే చెప్పారు. అలా కుదిరిన ఒప్పందంలో భాగంగా తన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించటం ద్వారా.. అసెంబ్లీలో అధికంగా ఉన్న సీమాంధ్ర సభ్యుల బలాన్ని తగ్గిస్తారు. మిగిలిన తేడాను ఓటింగ్ లోపు వివిధ మార్గాల ద్వారా సర్దుబాటు చేయటం ద్వారా విభజన వ్యవహారాన్ని తాను అనుకుంటున్నట్లుగా పూర్తి చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది.

    తన ప్రయోజనాలను కాపాడుకోవటంతో పాటు.. అధికారానికి దగ్గరయ్యేందుకు కాంగ్రెస్ ను ఊతం చేసుకోవాలని జగన్ తలపోస్తున్నారు. తాను ప్రయత్నించి విభజనను అడ్డుకున్నా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు ప్రాంతాల్లో విజయం సాధించటం కష్టం. అందుకే.. విభజన ద్వారా అధికారంలోకి రావచ్చన్న దూరాలోచనతో సమైక్యం పేరుతో విభజనకు తన వంతు సాయం చేసేందుకు సిద్ధమయ్యారు.

    Search Terms: YSRCP, Jagan, Congress, Sonia Gandhi, Telangana, Seemandhra

    Tollywood

    Bollywood

    Kollywood