ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Thursday, 5 September 2013

    సల్లూ సినిమాలో చరణ్

    Ram charan movie in Salman Khan Production
    హిందీ నుంచి రామ్ చరణ్ కి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. అక్కడ చేసిన తొలి  సినిమా విడుదలకు ముందే ఆయనకు పెద్ద పెద్ద నిర్మాణ సంస్థల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా సల్మాన్ ఖాన్ తన నిర్మాణ సంస్థలో రామ్ చరణ్ కి ఓ అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది. చరణ్ కీ, సల్మాన్ కీ  మధ్య స్నేహం ఉంది. సల్మాన్ నా పెద్దన్నయ్య లాంటి వాడు అని చెబుతుంటాడు చరణ్.

    ఆ అనుబంధంతోనే తన సొంత సంస్థలో చరణ్ కి...  సల్మాన్ అవకాశం ఇచ్చినట్టు సమాచారం. పారితోషికం కూడా చరణ్ ఎంత అడిగితే అంత ఇవ్వాలని నిర్ణయించుకున్నాడట. సల్మాన్ సినిమాతో పాటు  బాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ కూడా చరణ్ తో వరసగా రెండు సినిమాలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. 'జంజీర్' కోసం చరణ్ 13 కోట్ల పారితోషికం అందుకున్నట్టు సమాచారం. ఈనెల 6న విడుదలవుతున్న జంజీర్ విజయం సాధిస్తే మాత్రం చరణ్ కి మరిన్ని అవకాశాలు వెల్లువెత్తుతాయనీ బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

    Tollywood

    Bollywood

    Kollywood