ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Sunday, 29 September 2013

    మెగా హీరో గురించి నోటికొచ్చినట్లు అనేసాడు

    మెగా హీరో గురించి నోటికొచ్చినట్లు అనేసాడు
    నోరు తెచ్చినన్ని తంటాలు మరేదీ తెచ్చిపెట్టదు మనిషికి. అందుకే దాన్ని కంట్రోల్ చేయాలి. లేదంటే మనల్ని నట్టేట్లో ముంచేస్తుంది. దానికో తాజా ఉదాహరణ పూరీ జగన్నాథ్. పవన్ కళ్యాణ్ గురించి నోటికొచ్చిన స్టేట్ మెంట్లిచ్చి బుర్ర బొప్పి కట్టించుకున్నాడు. స్టార్ హీరోలతో సినిమాలు చేసేవాడు కాస్తా నితిన్, విష్ణు లాంటి వాళ్లతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా బుద్ధి రాలేదు మనోడికి. ఇప్పుడు మరోసారి టంగ్ స్లిప్పయ్యాడు. అది కూడా మెగా హీరో గురించే!

    తన పుట్టినరోజు సందర్భంగా తాజాగా ఓ తెలుగు పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చాడు పూరీ.  అప్పుడు ఓ ప్రశ్నకు సమాధానం చెబుతూ ఓ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని తెరకు పరిచయం చేసినందుకు తాను చాలా ఫీలవుతున్నానని అన్నాడు. అలా ఎందుకంటే... ఆ సమయంలో అతడికి సల్మాన్ ఖాన్ 'వాంటెడ్' సినిమాకి దర్శకత్వం వహించే చాన్స్ ఇచ్చాడట. కానీ తాను చిరుత సినిమా కమిట్ అయి ఉండటం వల్ల ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నాడట. ఆ చాన్స్ మిస్ చేసుకోవడం నా బ్యాడ్ లక్ అంటూ ఇప్పుడు నిట్టూర్చాడు. అంతేనా, తాను ఆ త్యాగం చేసి చిరుతను తీయడం రామ్ చరణ్ అదృష్టం అని అర్థం వచ్చేలా కూడా మాట్లాడాడు.

    గతంలో కూడా ఇలాగే అర్థం పర్థం లేని మాటలు మాట్లాడాడు. పవన్ తో పని చేయడం తనకు ఆనందాన్ని ఇవ్వలేదని, ఇంకెప్పుడూ అతడితో కలిసి పని చేయనని చాలా అతి చేశాడు. కట్ చేస్తే ఎక్కడికో పోయి పడ్డాడు. ఇప్పుడు మళ్లీ తన నోటి దూలను ఇలా ప్రదర్శించాడు. ఈసారి ఎక్కకెళ్లి పడతాడో చూడాలి. కాస్త నోరు అదుపు చేసుకో పూరీ. లేదంటే ఇండస్ట్రీలో నీకు త్వరలోనే నూకలు చెల్లిపోయే ప్రమాదం ఉంది!

    Tollywood

    Bollywood

    Kollywood