ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Sunday, 29 September 2013

    నయనతారతో ప్రేమాయనమా... అంతలేదు

    Nayantara Love affair, Nayantara Marriage
    ఎడా పెడా తిరిగేస్తుంటారు. అందరి కళ్లూ గప్పి ఎంజాయ్ చేస్తుంటారు. ఒకరి కోసం ఒకరు తపన పడిపోతుంటారు. అయినా కూడా ఏమీ విశేషం లేదని అంటుంటారు. ఇది ఎన్నో యేళ్లుగా ఇండస్ర్టీలో జరుగుతూనే ఉంది. మనం చూస్తూనే ఉన్నాం. వాళ్లు నిజం చెబుతున్నారో లేదో మనం కనిపెట్టేస్తాం కానీ, మనం కనిపెట్టేశామన్న విషయాన్ని సదరు సెలెబ్రిటీలు మాత్రం కనిపెట్టడం లేదు. అందుకే చెప్పిన స్టోరీయే తిప్పి తిప్పి చెప్పి చంపేస్తున్నారు.

    ప్రభుదేవాతో విడిపోయాక నయనతార ఆర్యకు దగ్గరయ్యిందని, ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారని ప్రపంచంమంతా కోడై కూస్తోంది. కానీ ఆ కోడికి పనేం లేక కూస్తోందని అంటున్నాడు ఆర్య. నయనతారతో తనకు ఎటువంటి సంబంధమూ లేదట. ఇంట్లోవాళ్లు తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారట. తనకు ఎలాంటి అమ్మాయి కావాలతో తన పేరెంట్స్ కి తెలుసట, వాళ్లు ఏ అమ్మాయిని సెలెక్ట్ చేస్తే ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడట.

    ప్రేమ వివాహం చేసుకోవాలన్న ఆలోచనలే తనకు లేదు అంటున్నాడు. అలాంటప్పుడు నయనతారతో ప్రేమలో ఎందుకు పడతాను అని ఎదురు ప్రశ్నలు కూడా వేస్తున్నాడు. ఇద్దరం కలసి పని చేస్తుండటం వల్ల అలా అనుకుంటున్నారని అంటున్నాడు.

    ఇండస్ట్రీలో ఈ ఇద్దరూ మాత్రమే కలసి పని చేస్తున్నారా? ఇంకెవరూ చేయడం లేదా? మరి వాళ్లమీద ఎందుకు రావడం లేదు ఈ పుకార్లన్నీ! కేవలం ఈ ఇద్దరి మీదే పని గట్టుకుని పుట్టిస్తున్నారా ఇవన్నీ! వినేవాడుంటే చెప్పేవాడు ఏమైనా చెబుతాడు అనడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి!

    Tollywood

    Bollywood

    Kollywood