ఈ దసరాకి పవన్ కల్యాణ్, ఎన్టీఆర్‌ల మధ్యే పోటీ అనుకొన్నారు. ఎందుకంటే అత్తారింటికి దారేది, రామయ్యా వస్తావయ్యా ఒక రోజు వ్యవధిలో ఢీ కొట్టడానికి సిద్ధమయ్యాయి. అయితే అనివార్య కారణాల వల్ల అత్తారింటికి దారేది ముందే వచ్చేసి, రికార్డులను ఓ పట్టు పడుతోంది. కాబట్టి.. రామయ్యకు ఢోకా లేనట్టే. కాకపోతే ఒకటే టెన్షన్. ఈ సినిమా అనుకొన్న సమయానికి సిద్ధం చేయడం కాస్త అనుమానంలానే తోస్తోంది. ఎందుకంటే మారిన సెన్సార్ నిబంధనల ప్రకారం 15 రోజుల ముందే సెన్సార్ బోర్డుకు అప్లై చేయాలి. కానీ.. రామయ్యా ఇంకా చేయలేదు. కారణం.. ఆర్.ఆర్. పూర్తవకపోవడమే. తమన్ ఇంకా ఆర్.ఆర్. కోసం రంగంలోకి దిగలేదు. దాంతో ఈ సినిమా అక్టోబరు 10 న రావడం కష్టమే అనిపిస్తోంది. మరో వారం వాయిదా పడుతుందా? లేదంటే తమన్ స్పీడుగా తన పని కానిచ్చేస్తాడా?? అనేది చూడాలి.
Saturday, 28 September 2013
Tollywood