పవర్ స్టార్.. పవర్ ఏమిటో బాక్సాఫీసుకు రుచి చూపించింది అత్తారింటికి దారేది. పైరసీ సుడిగుండంలో చిక్కుకొని కూడా – తన విశ్వరూపం చూపిస్తోందంటే అదంతా పవన్ కల్యాణ్ స్టామినాకు నిదర్శనమే. తొలి రోజే ఈ సినిమా అన్ని రికార్డులనూ చిత్తు చేసింది. శుక్రవారం నైజాంలో రూ.2 కోట్లు వసూలు చేసి దడ పుట్టించిందీ సినిమా. రాష్ట్రం మొత్తమ్మీద దాదాపుగా రూ.7 కోట్లు వసూలు చేసింది. మిగతా రాష్ట్ర్రాలూ, ఓవర్సీస్ కలుపుకొంటే అత్తారింటికి దారేది ఆల్ టైమ్ రికార్డ్‌గా నిలవడం ఖాయం అని విశ్లేషకులు తేల్చేస్తున్నారు. సీమాంధ్ర ఉద్యమ ప్రభావం కూడా ఈ సినిమాపై లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. భవిష్యత్తుల్లో ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
Saturday, 28 September 2013
Tollywood