ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Monday, 2 September 2013

    సీమాంద్రుల రక్తాన్ని తాగుతున్నారు

     సీమాంద్రుల రక్తాన్ని తాగుతున్నారు
    కాంగ్రెస్ పార్టీ వారు అన్నం తింటున్నారా... లేక సీమాంధ్రల రక్తం తాగుతున్నారా... అని ప్రజలు అంటున్నారు అంది షర్మిల. తిరుపతి నుంచి సోమవారం తన సమైక్యశంఖారావాన్ని ప్రారంభిస్తూ మాట్లాడారు. తెలుగు వారితో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు తెలుగువాళ్లలో చిచ్చుపెట్టింది అన్నారు. వైఎస్ ఉన్నన్నాళ్లు రాష్ట్రం అన్నపూర్ణగా ఉంటే ఆయన పోయాకా ఈ నాలుగేళ్లలో కుక్కలు చింపిన విస్తరి అయిందంటూ ఆమె ఘాటుగా విమర్శించారు.

    అన్నదమ్ముల మద్య అగ్గిపెట్టి కాంగ్రెస్ చలికాచుకుంటోంది అన్నారు. ఇంత జరుగుతున్నా ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఉలకడు పలకడు, ఎందుకంటే హైదరాబాద్ చుట్టూ వేలాది ఎకరాల భూమి తన వారిపేర్లపై చేయించుకున్నాడు, జగనన్న అధికారంలోకి వస్తే ఆయన ఆస్థులకు రక్షణ ఉండదని ఇలా చేస్తున్నాడు అంటూ చంద్రబాబు పై నిప్పులు చెరిగింది. తెలుగుదేశం ఈరోజు అన్ని పార్టీల్లో చచ్చిపోయిందని ఆమె చెప్పారు.

    ఇప్పుడు విభజన పేరుతో విడదీస్తే సీమాంద్రుల బతుకులు ఎడారిలా తయారవుతున్నాయని చెప్పింది. కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు సముద్రపు ఉప్పునీరు తప్ప మంచి నీళ్లెక్కడివి అని ఆమె ప్రశ్నించింది. నాగార్జునసాగర్, శ్రీశైలం కు నీళ్లెక్కడి నుంచి వస్తాయని ఆమె ప్రశ్నించింది. మద్యలో ఓ రాష్ట్రం వస్తే రైతుల పరిస్తితి ఏంటన్నారు షర్మిల. ఆనాడు విభజనతో సీమాంద్రులకు మద్రాస్ ను దూరం చేస్తే ఇప్పడు హైదరాబాద్ ను విడగొడుతున్నారన్నారు.

    60 ఏళ్లుగా హైదరాబాద్ ను అందరం అభివృద్ది చేసామని, ఇప్పుడు ఉద్యోగం, ఉపాది, చదువులు ఏం కావాలన్నా హైదరాబాద్ పై ఆదారపడ్డామని అది దూరమయితే సీమాంద్రుల పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు. అలాంటి హైదరాబాద్ ను నాలుగున్నర లక్షలకు అమ్మాలని చూసాడని ఆమె చంద్రబాబుకు చురకలంటించారు. ఆమె సమైక్య ఆరంభ ఉపన్యాసం అంతా చంద్రబాబును టార్గెట్ గా చేసుకునే సాగడం గమనార్హం.

    Tollywood

    Bollywood

    Kollywood