ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Monday, 2 September 2013

    ప్రియాంకపై బెంగ పెట్టుకున్న రాంచరణ్

    ప్రియాంకపై బెంగ పెట్టుకున్న రాంచరణ్
    ప్రియాంక చోప్రా వైఖరిపై రాంచరణ్ బెంగపెట్టుకున్నాడు, ఆయన తెలుగు తూఫాన్ సక్సెస్ పై ప్రియాంక వ్యవహారం ప్రభావం చూపుతోంది అంటున్నాడు. తూఫాన్ ప్రమోషన్ వర్క్ కు ఆమె దూరంగా ఉండడం రాష్ట్రంలో సినిమా హిట్టు కొట్టడంపై ఎఫెక్ట్ చూపుతుందని మెగా అభిమానులు కూడా అభిప్రాయ పడుతున్నారు.

    టాలీవుడ్ లో చాలా సినిమాలు ఇలా హీరోయిన్ల వైఖరితో ఇబ్బంది పడుతున్నాయి. అనుష్క, సమంత వంటి వారెందరో వారి నటించిన సినిమాల ప్రమోషన్ వర్క్ పై శ్రద్ద పెట్టకుండా దూరంగా ఉంటారు. కాని ప్రమోషన్ వర్క్ లో చురుకుగా పాల్గొనే బాలీవుడ్ హీరోయిన్లు ఇలా చేయరని అనుకుంటే ప్రియాంక అదే పని చేస్తుండడంతో రాంచరణ్ కాస్తా ఇబ్బందిగా  ఫీలవ్వుతున్నాడు అంటున్నారు.

    ఇటీవల తూఫాన్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు కూడా రాకపోవడం మెగా అభిమానుల్లో నిరాశను మిగిల్చగా అది సినిమా అంత బాగా లేదేమో, అందుకే హీరోయిన్నే రాలేదన్న సంకేతాలు వెలుబడ్డాయని, అప్పుడే తూఫాన్ సక్సెస్ పై రూమర్స్ కూడా వచ్చాయన్న భావం రాంచరణ్ లో నెలకొందంటున్నారు. ఓవైపు జంజీర్ ప్రమోషన్ వర్క్ లో ముంబయిలో చురుకుగా పాల్గొంటున్న ప్రియాంక అదే సినిమా తెలుగు వర్షన్ కోసం పనిచేయకపోవడంపై సినిమా యూనిట్ లో నిరాశను కల్గిస్తోందట.

    Tollywood

    Bollywood

    Kollywood