ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Friday, 27 September 2013

    ద‌టీజ్ ప‌వ‌న్ కళ్యాణ్

    That is Pawan Kalyan, ద‌టీజ్ ప‌వ‌న్ కళ్యాణ్
    నిర్మాత‌ల్ని నిలువునా గుంజేయ‌డ‌మే మ‌న స్టార్లకు తెలుసు అనుకొన్నాం. అది హీరో అయినా, ద‌ర్శకుడైనా అంతే! ఫైవ్ స్టార్ వ‌స‌తులు, పారితోషికాలూ అంటూ ప్రొడ్యూస‌ర్లను పిండేయ‌డ‌మే ప‌నిగా పెట్టుకొంటారు. వీరంతా వేరు.. ప‌వన్ కల్యాణ్ వేరు అని మ‌రోసారి అర్థమైంది. అత్తారింటికి దారేది సినిమా విడుద‌ల‌కు ముందే బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌డం వ‌ల్ల నిండా మునిగిపోయిన నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ని త‌న‌వంతుగా ఆదుకోవ‌డానికి ముందుకొచ్చాడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఈ సినిమా అనుకొన్న సొమ్మును రాబ‌ట్టుకోక‌పోతే.. తీసుకొన్న పారితోషికం తిరిగి ఇచ్చేస్తా.. అని ప‌వ‌న్ అభ‌య‌హ‌స్తం అందించాడు.

    అంతేకాదు.. త‌న త‌ర‌వాత సినిమా డేట్స్ కూడా ఇస్తాన‌ని మాటిచ్చాడు. దాంతో నిర్మాత ఊపిరి పీల్చుకొన్నాడు. ప‌వ‌న్ గ‌తంలోనూ ఇంతే. జానీ వ‌ల్ల న‌ష్టపోయిన పంపిణీ దారుల‌కు సొమ్ము తిరిగిచ్చేశాడు. తీన్ మార్ తీసి న‌ష్టపోయిన బండ్ల గ‌ణేష్‌కి గ‌బ్బర్ సింగ్ సినిమా ఇచ్చాడు. ఇప్పుడు మ‌రో నిర్మాత‌ను ఆదుకొన్నాడు. త్రివిక్రమ్ కూడా త‌న పారితోషికాన్ని తిరిగిఇవ్వడానికి సిద్ధమ‌య్యాడు. బంగారంలాంటి హీరో.. బాస‌ట‌గా నిలిచే ద‌ర్శకుడు దొర‌క‌డం కంటే.. ఓ నిర్మాత‌కు కావ‌ల్సింది ఏముంది? వెల్ డ‌న్ ప‌వ‌న్‌, త్రివిక్రమ్…!!

    Tollywood

    Bollywood

    Kollywood