ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Monday, 2 September 2013

    ఆమె కోసం ఎవ‌రైనా క్యూ క‌ట్టాల్సిందే

    more offers to nitya menon
    నిత్యామీన‌న్ అంటే అంద‌రికి మోజే. ఈ బ్యూటీ ముందుకు వ‌స్తున్న క‌థ‌ల‌ను ఒప్పుకోవాలి కాని టాలీవుడ్ మూవీల‌తో తెగ బిజిగా మారేది. కాని అంత‌సీన్ లేదంటుంది. టాలీవుడ్ నుండి ఎంతో మంది నిత్యామీన‌న్ వ‌ద్దకు ఎన్నో స్టోరిలను తీసుకువెళుతున్నారు. కాని అతి కొద్ది మూవీల‌కే గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఎందుకిలా అంటే త‌న లెక్కే వేరు అంటుంది. అంద‌రిలా నేను ఎక్కువ మూవీలను, డ‌బ్బును పోగేసుకోవటానికి ఇండ‌స్ట్రీకు రాలేదు. నాకంటూ ఓ స్టైల్ ఉంది. దాన్నే నేను ఫాలో అవుతాను. తొంద‌ర‌ప‌డి సినిమాలు చేస్తే న‌టిగా అంత గుర్తింపు ఉండ‌దు అని అంటుంది. నిత్యామీన‌న్‌పై ఎన్నో ఆశ‌లు పెట్టుకొని క‌థ‌లు రెడీ చేసుకుంటున్న ద‌ర్శకుల‌కు, నిత్యామీన‌న్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో షాక్ అవుతున్నారు.

    నిత్యామీన‌న్ ఎట్ ప్రెజెంట్ శ‌ర్వానంద్ మూవీలో న‌టిస్తుంది. త‌రువాత ఒక త‌మిళ మూవీ, రెండు మ‌ళ‌యాల సినిమాలు ఉన్నాయి. నిత్యామీన‌న్ కేవ‌లం ఒక సినిమా త‌రువాత మ‌రో సినిమా అంటూ కూర్చోవ‌డంతో, మిగిలిన సినిమాలు పోస్ట్‌పోన్ చేసుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. అందుకే నిత్యాను త్వర‌గా మూవీను ఫినిష్ చేసుకోవాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. ఇలాగైతే మా మూవీలు రిలీజ్ చేసుకోవటానికి చాలా సంవ‌త్సరాలు ప‌డుతుంది. ఇక‌నైన మీరు మేలుకోండి అంటు నిత్యామీన‌న్‌ని వేడుకుంటున్నారు నిర్మాత‌లు. నిత్యా మాత్రం వాళ్ల మాట‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. ఈ ధోర‌ణి ఇలాగే కొన‌సాగితే నిత్యాను ఆ మూవీల నుండి రిప్లేస్ చేసే అవ‌కాశాలు కూడ ఉన్నాయంటున్నారు.

    Tollywood

    Bollywood

    Kollywood