సూపర్ స్టార్ రజనికాంత్ తన తదుపరి సినిమాలో ‘విక్రమ సింహా’గా మనముందుకు రానున్నాడు. తమిళ్ లో ఇదే సినిమా ‘కొచ్చాడయాన్’గా రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాతో రజని చిన్న కూతురు సౌందర్య రజనికాంత్ దర్శకురాలి అవతారం ఎత్తుతుంది. ఈ చిత్రం సాధారణ సినిమాలవలే కాకుండా 3డి మోషన్ క్యాప్చ్యూర్ పరిజ్ఞానంతో ప్రేక్షకులను మైమరపించడానికి సిద్ధమవుతున్నారు.
ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఇదివరకు ఈ పోస్టర్ కేన్స్ చలనచిత్ర వేడుకలో విడుదలచేస్తారని పుకార్లు వచ్చాయి. కానీ ఆఖరికి ఈ పుకార్లకి సౌందర్య ముగింపు పలుకుతూ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ సెప్టెంబర్ 9న విడుదలకానుందని తెలిపింది.
ఈ సినిమాకు ఏ.ఆర్ రెహమాన్ స్వరాలను సమకూరుస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెలుగులో లక్ష్మిగణపతి ఫిల్మ్స్ ద్వారా ప్రేక్షకులకు అందించనున్నారు.