జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే జగనన్నకు రకరకాల అయిడియాలు వస్తున్నాయి. అన్నయ్య బయటకు రావడానికి ముందు చెల్లెమ్మ.. మనం సమైక్యం అని పాట పాడుతూ ఎన్నిరకాలుగా ఉద్యమిస్తున్నా కూడా మనకు పెద్దగా మంచి పేరు రావడం లేదే. సమైక్యానికి మనం దన్నుగా ఉన్నట్లు ప్రజలు మనల్ని గుర్తించడం లేదే. మనం ఇంకా ఏదో చేయాలి. మనం సమైక్యం అనడం కాదు. ఇతరులు సమైక్య వ్యతిరేకులు అనే ప్రచారం చేయాలి అన్నట్లుగా ఒక యాక్షన్ ప్లాన్ ప్రకటించిన సంగతి మనకు తెలుసు.
అయితే చెల్లెమ్మ వ్యక్తంచేసిన ఆవేదనకు అన్నయ్య జైలులో కూర్చుని మంచి స్కెచ్ వేసుకుని వచ్చినట్లుగా కనిపిస్తోంది. సీమాంధ్ర ప్రాంతంలో చాలా పెద్దఎత్తున జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మొత్తం తన ఖాతాలోకి వచ్చేసేలా హైజాక్ చేయడానికి అన్నయ్య ప్లాన్‌తో ఉన్నారు. అందుకే ఉద్యమానికి పూర్తిస్థాయిలో రాజకీయ రంగు పూయడానికి కూడా సిద్ధపడ్డారు.
సమైక్యం అంటున్న కొన్ని పార్టీలను వెంటబెట్టుకుని.. హైజాక్చేసేసి సమైక్య స్ఫూర్తిని తన ఖాతాలో రాసుకోవాలనేది కోరిక. అయితే ఎలాంటి కుట్రలు చేసినా నిజంగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికే కట్టుబడితే పరవాలేదు. అలాకాకుండా.. అడ్డగోలుగా తన స్వప్రయోజనాలకు అనుగుణంగా కొత్తరీతిలో దోచుకోడానికి పరిణామాల్ని మార్చుకోవడానికి, ఉద్యమాన్ని వాడుకోజూస్తే మాత్రం అది గర్హనీయం అవుతుంది.
Search Terms: Jagan Mohan Reddy, YSRCP, Jagan Bail, Samaikyandhra, Seemandhra